పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


మరో ప్రముఖ చరిత్రకారుడు H.beverdge 1857 నాటి,'..తిరుగుబాటుకు బేగం ఆత్మలాంటిదిది '. అని బేగం హజరత్‌ మహాల్‌ను ప్రస్తుతించాడు. ( A Comprehensive History of India, H. Beveridge, 1887 Ed. Vol.III, Page. 842. Quoted by Mr. Srivasthava in his book Freedom Fighters of Indin Mutiny 1857 at page.105) ఆమె పర్దానషీ మహిళ కానట్టయితే మిగతా పురుషుల కంటే గొప్ప పోరాట యోధు రాలుగా ఖ్యాతి గడంచేది..', అని ప్రముఖ చరిత్రకారుడు Mr. Abdul Harim Sharar వ్యాఖ్యానించాడు. (Freedom Fighters of Indian Mutiny 1857, Mr. Srivasthava, page.105) అవధ్‌లో పరిస్థితులు కొంతమేరకు మెరుగు పడ్డాక బేగం హజరత్‌ మహాల్‌ తన రాజకీయ కుశలతను చూపనారంభించారు.బ్రిటిషర్లతో మిలాఖత్‌ అయిన నేపాల్‌ పాలకుడు జంగ్ బహద్ధూర్‌ను తనవైపుకు తిప్పుకునేందుకు పావులను కదిలించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వదేశీ పాలకులతో చేతులు కలిపినట్టయితే ఆయనకు కంపెనీ పాలకులు ఆశపెట్టిన దానికంటే, ఎక్కువ భూభాగాన్నిఇవ్వగలనని వర్తమానం పంపారు. అవధ్‌ ఇరుగుపొరుగు స్వదేశీ పాలకులకు రానున్న గడ్డు పరిస్థితుల పట్ల హెచ్చరికలు చేస్తూ, అవసరాన్ని బట్టి ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుంటూ, మంత్రాంగం నడుపుతూ బేగం హజరత్‌ మహాల్‌ కంపెనీ పాలకులకు చెమటలు పట్టించారు.

ఈ విధంగా బేగం తన పాలనాదక్షతతో స్వదేశీ పాలకుల మద్దతుతో అవధ్‌లో పరిస్థితు లను అనుకూలంగా మార్చుకుంటున్న దశలో ఢల్లీ లో తిరుగుబాటు విఫలమెంది. బహుద్దాూర్‌ షా జఫర్‌ ను ఆంగ్లేయులు అరెస్టు చేశారు. తిరుగుబాటుకు కేంద్రంగా భావించిన ఢిల్లీ ఆంగ్లేయుల వశమైంది. ఈ వార్తలు తిన్నగా లక్నోచేరాయి. ఆ ప్రతికూల పరిస్థితులలో కూడ ఆమె అధైర్యపడలేదు. ప్రజల, స్వదేశీ యోధుల అండదండలతో కంపెనీ అధికారులకు కిం మీద కునుకు లేకుండ చేశారు.

బేగం హజరత్‌ మహాల్‌ సుమారు 10 మాసాల పాటు ప్రత్యక్షం గా పాలన చేశారు. ఆంగ్లేయులు లక్నోలోని ఆలంబాగ్ లోని రెసిడెన్సీ దాగి ఉండటం, ఆ రెసిడెన్సీ నుండి బయటపడి లక్నోను స్వాధీనం చేసుకొవడానికి కంపెనీ అధికారులు వేస్తున్న ఎత్తులను గమనించిన ఆమె రెసిడెన్సీ మీద దాడికి తన సైనికులను పురికొల్సారు. ఈ చర్య 44