పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు

క్షేమం కోరుతూ సజీవదాహనమైన అస్గరి బేగం, సాయుధంగా ఆంగ్ల సైన్యాలను నిలువరించిన బేగం జమీలా, కత్తిపట్టి కదానరంగాన శతృవును సవాల్‌ చేసిన సాహసి బేగం ఉమ్‌ద్దా తదితరులు ఎందరో ఉన్నారు. చరిత్ర నమోదు ప్రకారం ఆనాడు ఇతర సాంఫిుక జనసముదాల తోపాటుగా వందలాది ముస్లిం మహిళలు కాల్చి వేయబడ్డారు. సజీవ దహనమయ్యారు. ఉరితీయబడ్డారు. అవమానాలకు, అత్యాచారాలకు గురయ్యారు. ఈ మేరకు ఆ సమాచారాన్నిబ్రిీటిష్‌ అధికారుల డైరీలు, లేఖలు బహిర్గతం చేస్తున్నాయంటే, ఆ వీరనారీమణుల త్యాగాలు ఎంతి మహత్తరమైనవో మనం అర్థ్ధం చేసుకోవచ్చు.

జాతీయోద్యామంలో....

ప్రథమ స్వాతంత్య్రసమరం రగిల్చిన స్వాతంత్య్ర కాంక్ష లక్షలాది మహిళలను స్వాతంత్య్రోద్యమం వైపు నడిపింది. పూర్వీకుల అసమాన పోరాలను వారసత్వంగా స్వీక రించిన ముస్లిం మహిళ లు ఖిలావత్ ఉద్వమం ద్వారా పెద్ద సంఖ్యలో జాతీయోద్యమంలో అడుగు పెట్టారు . ఈ సందర్బంగా ఖిలాఫత్‌ కమిటీ జాతీయ కాంగ్రెస్‌ నిర్వహించిన సహాయ నిరాకరణోద్యమం, విదేశీవస్తు బహిష్కరణ, మద్యాపాన నిషేధం లాింటి పలు కార్యక్రమాలలో ముస్లిం స్త్రీలు బృహత్తర పాత్ర నిర్వహించారు. బ్రిీటిష్‌ పాలకుల దమననీతి, నిర్బంధలకు భీతిల్లకుండ జాతీయోద్యమబాటలో నడిచిన స్త్రీలలో బీబీ అమ్మకు తొలి స్థానం లభించింది. ఆమె అసలు పేరు ఆబాదీ బానో బేగం కాగా బీబీ అమ్మగా ఆమె చిరస్ రణీయ ఖ్యాతి గడించారు. అనితర సాధ్య మైన సాహసంతో, అద్బుతమైన ప్రసంగాలతో, ఆదర్ వంతమై న నేతృ త్వంతో ఖిలాఫత్‌ ఉద్యమం కోసం దేశమంతా తిరిగి ఆమె నిధులను సమకూర్చారు. ఈ నిధులే భారత పర్యటన గావించిన గాంధీజీకి ఉపయోగపడ్డాయి. ఈ దేశపు కుక్కలు పిల్లులు కూడ బ్రిటిష్‌ బానిస బంధనాలలో నుండ వీలులేదని గర్జించిన ఆమె హిందూ-ముస్లింల ఐక్యతకు చివరి వరకు కృషి సల్పారు. జాతీయోద్యమకారులంతా తనను అమ్మ అని పిలుసున్నందున, బిడ్డల ఎదుట తనకు పర్దా అక్కరలేదని ప్రకటించి, పర్దాలేకుండ బహిరంగ సభలలో ప్రసంగించిన సాహసి ఆబాది బానో బేగం. ఆబాది బానో బేగం బాటలో నడిచిన మరొక చిచ్చర పిడుగు నిషాతున్నీసా బేగం. ఆమె ఫైర్‌ బ్రాండ్‌గా పిలువబడిన మౌలానా హస్రత్‌ మొహాని భార్య. భర్త పలుమార్లు జెలుకు వెళ్ళినా అధర్య పడకుండ ఉద్యమబాటన చివరికంటా నడిచిన మహనీయురాలు.


27