పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

మహాల్‌ ముఖచిత్రంతో వెలువడిన ఈ గ్రంథం ఈ రచయిత గ్రంథాలలో మణిపూస అని చెప్పవచ్చు..'

- విశాలాంధ్రా దినపత్రిక, 13-07-2003 మాతృదేశాన్ని'...విదేశీ దాస్యశృంఖలాల నుంచి విముక్తం చేయడంలో మైనారిటి మహిళలు కూడ తమవంతు పాత్రను నిర్వహించారని, ఆ క్రమంలో అప్పటి సంప్రదాయాలను, కట్టుబాట్లను ఛేదించుకుని బయికి రావడనికి కూడ సంకోచించలేదని నిరూపించటంలో సఫలమయ్యారు రచయిత. మతవిద్వేషాలు సామాజిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్న ఈ తరుణంలో ఇలాంటి పుస్తకాలు,అదీ స్థానిక భాషలలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది..'.

  • - ఆంధ్రజ్యోతి దినపత్రిక 12-06-2003

'...నేడు ' సరిదిద్దే ' పేరుతో చరిత్రను కాషాయీకరించే సర్కారీ ప్రయత్నాలు సాగుతున్నాయి.దేశ విభజనకు దారి తీసిన పరిణామాలపై కూడ వక్రీకరణలు చేస్తున్నారు. ద్విజాతి సిద్ధాంతాన్నిమొదట ప్రచారంలోకి తెచ్చింది హిందూ ఛాందస నాయకుడు వి.డి.సావర్కర్‌ కాగా ముస్లిం నేతలే మొదట దిద్విజాతి సిద్ధాంతాన్ని తెచ్చారని వాదనలు ముందుకు తెస్తున్నారు. ఈ స్థితిలో నశీర్‌ అహ్మద్‌ చేస్తున్న కృషి అభినందించదగింది....మన దేశంలోని ముస్లిం మహిళలు కూడ ఆ పోరాట పటిమను, దృఢచిత్తాన్ని దేశ స్వాతంత్య్ర పోరాటంలో చూపెట్టారు. వారి ధైర్యసాహసాలను, పాఠకుల కళ్ళముందు ఆవిష్కరింపచేస్తుంది సులభ శైలిలో సాగిన ఈ పుస్తకం.'

- ప్రస్థానం, త్రైమాసపత్రిక, జనవరి-మార్చి 2003

  • '...బురఖాలు ధరించే ముస్లిం మహిళలకు ప్రపంచం తెలియదని భావించే వారు అచ్చెరువొందే సంఘటనలతో పునర్ముద్రణకు నోచుకున్న పుస్తకం భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం మహిళలు, పుస్తక పఠనం పై ఆసక్తి సన్నగిల్లిన ఈ పరిస్తితులలో ఈపుస్తకం...రెండో ముద్రణకు రావడం విశేషం...చరిత్రను శోధించి సేకరించిన సమాచారాన్ని సులభశైలిలో అందించటంలో మంచి కృషిచేశారు రచయిత.'

- ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం, 2003

  • 'స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ముస్లిం మహిళల గురించి సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌ రాసిన భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం మహిళలు స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళల పాత్రను వివరిస్తూ తెలుగులో వచ్చిన తొలి పుస్తకం ఇది...ఈ పుస్తకం చదవడం ద్వారా చరిత్రలో చిరస్థాయిగా నిలచిన అనేకమంది మహిళల వీరోచిత గాథలను, జీవితాలను తెలుసుకోవచ్చు. నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక

292