పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


సృష్టించుకున్నారు. ఆమెలోని మానవతా భావనలు, సేవా దృక్పధం గుర్తించిన కాశ్మీరు ప్రజలు ఆమెను ' మదార-యే-మెహర్బాన్‌ ' (Madr-e-Meharban) అని సంబోధిసూ, ఆమెపట్ల వారితోగల ప్రేమాభిమానాలను చాటుకున్నారు. మదార-యే-మెహర్బాన్‌ అంటే 'దయ గలతల్లి ' అని అర్ధం.

ఈ మేరకు అటు భర్తకు రాజకీయాలలో తోడ్పటు అందాచేస్తూ, ఇటు కాశ్మీరు ప్రజలను ముఖ్యంగా కాశ్మీరు మహిళల సంక్షేమం కోసం చివరి స్వాసవరకు క్రియాశీలకంగా శ్రమించిన బేగం అక్బర్‌ జెహాన్‌ 2000 సంవత్సరంలో కన్నుమూశారు.

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

మన..ముస్లిం మత పెద్దల తప్పు వొకటే. తమ స్రీలను చదువు సంధ్య లేని వాళ్ళుగా వుంచారు. లేకుంటే చదివించినా రాజకీయ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా వుంచారు. జాతి తల్లులలో రాజకీయ పరిజ్ఞానం లేనందున జాతి జనులలో కూడ రాజకీయాల పట్ల సరైన అవగాహనకు ఆస్కారం లేకుండ పోయింది...మీ ఆ చేష్టలకు ముగింపు పలికి భవిష్యత్తు గురించి జాగ్రత్త వహించండి. మీ చర్యల వలన కలిగిన నష్టాన్నిభర్తీ చేసుకోడనికి మార్గం వొక్కటే. అది మీ స్త్రీలను విద్యావంతుల్ని చేయడం. విజ్ఞానార్జన ద్వారా సరైన రాజకీయ దృక్పథం, మంచి అవగాహన వారిలో కలుగచేయడం. ఆ ఆవకాశాలను వారికి కల్పించటం.

-జాహిదా ఖాతూన్‌ షేర్వానియా.

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

278