పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


బేగం అక్బర్‌ జెహాన్‌ ప్రత్యేక చర్య లు తీసుకున్నారు. బాధితులకు స్వాంతన చేకూర్చేందుకు ఆమె తీసుకున్న చర్యలను మౌంటుబాటన్‌ భార్య ఎడ్వినా మౌంటు బాటన్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. (The Legend Makers Some Eminent Muslim Women of India, Page.108)

బేగం అక్బర్‌ జెహాన్‌ చాలా సందర్భాలల్లో డాక్టర్‌ అబ్దుల్లాకు సహాయసహాకారాలు అందిస్తూ పరోక్షరాజకీయాలలో గడుపుతూ, సందార్భాన్ని బట్టితన శక్తిసామర్ధ్యాలు ప్రజల కోసం ప్రదర్శించారు. అతి కిష్ట సమయాలలో భర్తకు తోడుగా నిలిచారు. ఆ పరిస్థితులకు అతీతంగా కశ్మీరు ప్రజల మనస్సుల మీద ఆమెకున్నరాజకీయ పట్టు 1971 నాటిఎన్నికలలో వెల్లడైంది. ఆ సమయంలో ప్రముఖ రాజకీయ నాయకుడు, బక్షీ గులాం ముహమ్మద్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా శ్రీనగర్‌ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి షమీం అహమ్మద్‌ షమీం రంగంలో నిలిచారు. ఆ ఎన్నికల సమయాన ఆమె భర్త డాక్టర్‌ అబ్దుల్లా కశ్మీరులో లేరు.

ఆ ఎన్నికల్లో బేగం అక్బర్‌ జెహాన్‌ స్వతంత్ర అభ్యర్థి షమీం అహమ్మద్‌కు మద్దతు పలికారు. ఆ సందర్భంలో ఆమె చాలా విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె కృషివలన అంతగా పరిచయంలేని షమీంను ప్రజలు గలిపించి రాజకీయ వస్తాదు గా పేర్గాంచిన గులాం ముహమ్మద్‌ను పరాజితుడిన్ని చేశారు. ఆ చరిత్రాత్మక పరిణామాలకు బేగం అక్బర్‌ జెహాన్‌ కేంద్రబిందువు కావటం ద్వారా ఆమె వ్యక్తిత్వం పట్ల ప్రజలలో ఉన్న అభిమానం, ఆమెకున్న పలుకుబడి వెల్లడయ్యాయి.

1977లో జరిగిన ఎన్నికలలో ఆమె శ్రీనగర్‌ పార్లమెంటరీ స్థానానికి పోటీ చేశారు. ఆ ఎన్నికలో భారీ ఆధిక్యతతో ఆమె గెలుపొంది పార్లమెంటులో ప్రవేశించారు. కశ్మీరు ప్రజల నేతగా పార్లమెంటు సభ్యు రాలిగా అక్బర్‌ జెహాన్‌ బహుముఖ పాత్ర నిర్వహించారు. మహిళల సమస్యల పట్ల ఆమె అధిక శ్రద్దచూపారు. మహిళలలో చైతన్యం కోసం, మానసిక వికాసం, అభివృద్ధికోసం గాను అనేక సంసలను స్థాపంచారు. పలు సంస్తలలో భాగస్వాములయ్యారు. మహిళాభివృద్ధి ప్రధాన ఆశయంగా స్థాపించిన మర్కజ్‌-యే- బెహబూద్‌-యే-ఖవాతీన్‌ (Markaz-e-Behbood-e-Khawateen) లో ఆమె కీలక బాధ్యతలు నిర్వహిస్తూ మహిళలకు సేవలందించారు. ఈ సంస్థతో ఆమె అర్థ శతాబ్దంపాటు మంచి సంబంధాలు కలిగి ఉండి సామాజిక సేవా రంగంలో తనదైన చరిత్ర

277