పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


తండ్రి వైద్యశాఖలో ఉప డైరక్టరుగా పనిచేశారు. ఆమె సోదరుడు అలీ యావర్‌ జంగ్‌ హైదారాబాదులో విద్యామంత్రిగా వుండి, తరువాత ఈజిప్టు, యగోస్లోవియాలలో భారత రాయబారి పదవి నిర్వహించారు. ఆమె వంశంలోని అకిల్‌ జంగ్‌ పి.డబ్యూ.డి మంత్రి గానూ, ఆమె దగ్గరి బంధువు మోహ్దీన్‌ యార్‌జంగ్‌ మంత్రి పదవులను నిర్వహించారు. ఆమె సన్నిహిత బంధువులంతా ఉన్నత విద్యావంతులుగాని ఉన్నత పదవులు నిర్వహించినవారు గాని కావటంతో పరిపాలనా దక్షత ఆమెకు ఉగ్గుపాలతో పెట్టినట్లయ్యింది.

1922లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదివిన సమీప బంధువు హుసైన్‌ అలీ ఖాన్‌ను మాసుమా బేగం వివాహం చేసుకున్నారు. ఆతరువాతి కాలంలో ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం అధిపతిగా పనిచేశారు. ఆయన డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు లాంటి ప్రముఖులకు గురువుగా గణనకెక్కారు. అంతి విద్వత్తు స్వతంత్ర, ఉదార భావాలు గల వ్యక్తి భర్తగా లభించటంతో చిన్నతనం నుండి సమాజ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిన మాసుమా బేగం ఆ బాటలో ఇనుమడించిన ఉత్సాహంతో సాగగలిగారు.

తల్లితండ్రులు విద్యావంతులు కావటం, భర్తకూడ మంచి పండితుడు కావటంతో మాసుమా బేగం విద్యావ్యాప్తి పట్ల దాృష్టిసారించారు. మహిళల్లో చైతన్యాన్ని చదుా వు ద్యారా సాధించవచ్చని, సమస్యల పరిష్కారానికి విద్యా ఇతోధికంగా తొడ్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు . సమాజసేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా లభించిన అనుభవం మేరకు అన్ని సామాజిక రుగ్మతలకు నిరక్షరాస్యత ప్రధాన కారణమని భావించిన ఆమె ఆ రంగాన్ని ఎంచుకున్నారు.

1921లో విద్యావ్యాప్తి ప్రధాన లక్ష్యంగా గల అంజుమన్‌కు అధ్యాక్ష్యులు గా ఆమె ఎన్నికయ్యారు. భర్త అనుమతి, ప్రోత్సాహంతో విద్యావ్యాప్తి కోసం మాత్రమే కాకుండ సంఘసేవా కార్యక్రమాలలో, సామాజిక రుగ్మతల నివారణకు చురుకుగా పాల్గొన్నారు. పలు విద్యా, సాంఫిుకసేవా సంస్థల ఏర్పాటుకు కృషిచేయటమేకాకుండ ఆయా సంస్థలలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. ప్రధానంగా మహిళా సంఘాల కార్యక్రమాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించారు. 1927లో అఖిల భారత మహిళా సంస్థకు హైదారాబాద్‌లో శాఖను ఏర్పాటు 266

265