పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు


చివరికంటగా స్వరాజ్యం సాధించేందుకు ముందుకు సాగారు. ఆ కుటుంబం ఆకాంక్షాంచిన స్వరాజ్యం సిద్ధించింది. ఆశించ ని విధం గా భారత దేశ విభజన జరిగింది. ఆ సందర్బంగా కిద్వాయ్‌ కుటుంబం వ్యాకులతకు లోనైంది. ఆ బాధ నుండి తేరుకొనే లోపుగా అనిస్‌ మీదా పెను ఉప్పెన విరుచుక పడింది. ఆమె భర్త షషీ అహమ్మద్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఆది నుండి

అనీస్‌ కిద్వాయ్‌ హ్ందూ-ముస్లింల ఐ క్యతను కోరుకుంటూ మతోన్మాదాన్ని అన్ని విధాల ఎదుర్కొన్న షఫీ అహమ్మద్‌ను మతోన్మాద జ్యాలలు బలితీసుకున్నాయి. ఆ సమయంలో ఆయన ముస్సోరి మున్సిపల్‌ బోర్డులో కార్యనిర్వాహక ఆధికారిగా బాధ్య తలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలోని హిందూ-ముస్లింల మధ్యన సామరస్యం కోసం నిరంతరం తపనపడ్డారు. ఆ దిశగా మహాత్మాగాంధీ మారదర్శకత్వంలో ఎంతో కృషి సల్పారు. అటు వంటి హిందూ-ముస్లిం ఐక్యతాభిలాషిని విభజన నేపధ్యంలో వెల్లువెత్తిన మతోన్మాదం పొట్టనపెట్టుకుంది.

ఆ సంఘటనతో అనిస్‌ బేగం చలించిపోయారు. ఏ మతోన్మాద రాక్షసి నుండి ప్రజలను కాపాడలని ఆ దంపతులు నిరంతరం పనిచేశారో ఆ ఉన్మాదానికి ఆమె భర్త బలయ్యారు. ఆ పరిస్థితి ఆమెలో సరికొత్త ఆలోచనలకు కారణమైంది. ఈ మతోన్మాద భూతం ఎంతమందిని బలితీసుకుంటుదోనని ఆమె తపించిపోయారు. ఆ విధంగా సన్నిహితులను కోల్పోయిన కుటుంబాల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఆమెను నిలువనివ్వలేదు . ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న మహాత్మా గాంధీ వద్దకు వెళ్ళారు.

ఆనాడు దేశమంతా విభజన వాతావరణంతో ప్రజ్వరిల్లుతుంది. కుటుంబాలకు కుటుంబాలు అటు,ఇటు వెడుతున్నాయి. అమాయకులు రాక్షస ఉన్మాదానికి బలవుతున్నారు. ఈ పరిస్థితుల చేదు అనుభవాలను ప్రధానంగా మహిళలు, పిల్లలు వృద్ధులు ఎదుర్కొంటున్నారు. ఉన్మాదుల రక్తదాహానికి, భయానక చేష్టలకు మహిళలు బలవుతున్నారు. కూడు,గూడు లేక అల్లాడిపోతున్నారు. ఆ పరిణామాల నేపధ్యంలో

263