పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


సమావేశాలకు హజరవుతూ తండ్రి నుండి బ్రిటీష్‌ వ్యతిరేకతను సంతరించుకున్నారు. ఆయన మౌలానా ముహమ్మద్‌ అలీ సంపాదకత్వంలోని కామ్రెడ్‌, రాజా గులాం హుస్సేన్‌

సంపాదకత్వంలోని న్యూ ఎరా పత్రికలలో ప్రత్యేక వ్యాసాలు రాశారు. తండ్రి నుండి

రాజకీయ, సాహిత్య పరిజ్ఞానాన్ని, దేశభక్తి భావనలను ఆమె చిన్నతనంలోనే పుణికి పుచ్చుకున్నారు.

ఆ కుటుంబం రాజకీయంగా ఎలా ఉన్నా విద్యవిషయంలో మాత్రం సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ మార్గదర్శకత్వంలో మగ పిల్లలందరికి ఆంగ్ల చదువులు చెప్పించి, ఆడపిల్లలను మాత్రం దూరంగా ఉంచింది. అనిస్‌ బేగం సోదరులకు విద్యగరిపేందుకు ట్యూటర్లను ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆమె కూడ సోదరులతో కలసి కూర్చోని ఉర్దూ, ఇంగ్లీషు భాషలను నేర్చుకున్నారు తప్ప ప్రత్యేకంగా ఆమె చదువుకోలేదు. ఆమె 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తండ్రి ఇనాయత్‌ అలీ కన్నుమూశారు. ఆ కారణంగా ఆమెకు చదువుకునే అవకాశాలు లేకుండా పోయాయి.

ఆమె తమ సన్నిహిత బంధువు షఫీ అహమ్మద్‌ కిద్వాయ్‌ను వివాహం చేసుకున్నారు. షఫీ అహమ్మద్‌ ప్రముఖ జాతీయోద్యమకారుడు రఫి అహమ్మద్‌ కిద్వాయ్‌ తమ్ముడు. అన్నతోపాటుగా షఫీ అహమ్మద్‌ కూడ బ్రిటిషు వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నారు. సహాయనిరాకరణ ఉద్యమం సందర్బంగా తాను చేస్తున్న ప్రబుత్వఉద్యోగానికి రాజీనామా చేసి రఫి అహమ్మద్‌ కిద్వాయ్‌తో కలసి ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన ముస్లింలీగ్ రాజకీయాలకు వ్యతిరేకి. హిందూ- ముస్లింల ఐక్యతకోసం నిరంతరం కృషి చేసిన ప్రముఖులు. (Rafi Ahamed Kidwai : Page. 34-35)

చిన్ననాటనే తండ్రి నుండి జాతీయ భావాలను సంతరించుకున్నఅనిస్‌ బేగంకు బ్రిటిషు వ్యతిరేక భావాలు గల భర్త లభించటం, అటుపుట్టింటివారు, ఇటు అత్తింటివారు వారు కూడ జాతీయోద్యమకారులు కావటంతో ఎంతో ప్రోత్సాహం లభించింది. ఆ ప్రోత్సాహంతో ఉద్యమకార్యక్రమాలలో ఆమె మరింతగా నిమగ్నమయ్యారు. బావ, భర్త ఖిలాఫత-సహాయనిరాకరణ ఉద్యమాలలో అగ్రగాములుగా నిలచి పోరుబాట సాగటంతో అనిస్‌ బేగంకు పోలీసుల బెడద తప్పలేదు. కుటుంబంలోని ఆర్జనాపరులు ఉన్నతా ఉద్యోగాలను వదలుకుని ఉద్యమబాట పట్టడంతో ఆర్థిక ఇబ్బందులు కూడ అనిస్‌ బేగంను చుట్టునుట్టాయి. ఆనాడు రాజకీయంగా దృఢమైన అభిప్రాయాలు గల అనిస్‌ను అటు పోలీసులుగాని ఇటు ఆర్థిక ఇబ్బందులుగాని ఏమీ చేయలేకపోయాయి. ఆమె

262