పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

సమస్య గురించి చర్చించారు. ఆ రోజుల్లో ఆర్థిక స్వాతంత్య్రమే ముఖ్యమైన సమస్య అనుకునేవాళ్ళం. నేను చదువుకుని, సంపాదించి ఎవరి మీదా ఆధారపడకుండా వుంటానని నిర్ణయించుకున్నాను. నాన్నకు చెప్పాను, ఆయన ఏమీ అభ్యంతరం పెట్టలేదు, కాని బంధువులు విమర్శించారు. తర్వాత కూడా పెళ్ళి గురించి ఆలోచించలేదు. నాపనిలో నిమగ్నురాలినై, దాని గురించి ఆలోచించలేదు. బహుశ సరియైున సమయంలో ఎవరూ కనిపించలేదేమో! అన్నిసంబంధాలు కూడ వరకట్నం, బేరాలతో నియమించబడేవి. అవంటే అసహ్యం వచ్చి, ఎవరితోటి ఆ విషయం గురించి మాట్లాడకపోయేది. నాన్న కూడ వాటిని వ్యతిరేకించేది. మా కుటుంబంలో చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు.

ఈ వాక్యాలు ఆమెలోని విప్లవాత్మక భావాలకు అద్దం పడతాయి. ఆ ఆభిప్రాయా లతో స్నేహం చేసిన రజియా బేగం చివరి వరకు వివాహం చేసుకోలేదు. చిన్న వయస్సు లోనే జాతీయోద్యమం, ఆ తరువాత కమ్యూనిస్టు ఉద్యమం, ఆ క్రమంలో ఇండియన్‌ యూనియన్‌లో నైజాం విలీనోద్యమం, అటు తరువాత తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నయోధురాలు రజియా బేగం ఉద్యమాల చరిత్రలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

(ఈ వ్యాసం ప్రదానంగా 1986లో స్త్రీ శక్తి సంఘ టన (హెదారాబాద్‌) ప్రచురించిన ' మనకు తెలియని మన చరిత్ర (తెలంగాణా రైతాంగపోరాటంలో స్త్రీలు-ఒక సజీవ చరిత్ర) ' గ్రంథంలోని రజియా బేగం ఆమె సోదరి జమాలున్నీసా బాజి తమ ఇంటర్యూలో చెప్పిన సమాచారం ఆధారంగా రూపొందించటం జరిగింది. ఆ గ్రంథం సంపాదకులు, ప్రచురణకర్తలకు నా ధాన్యవాదాలు. - రచయిత)

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

ఆ మహిళ (ఆకుపచ్చ దుస్తుల) యోధురాలు)అద్వితీయ ధైర్య శాలి. ఆమెకు మృత్యుభయ ఏ మాత్రం లేదు. ఫిరంగులు గర్జిస్తున్నా, తుపాకులు గుండ్లను వర్షిస్తున్నాఅత్యంత ధైర్యశాలి అయిన సైనికుడి మల్లే ఆమె తుపాకి గుండ్ల వర్షంలో నింపాదిగా నడిచి వెళ్ళేది. ఆమెను కొన్నిసార్లు నడిచి వస్తుంటే చూశాం. మరికొన్నిసార్లు గుర్రం మీద స్వారి చేస్తూ చూశాం. ఖడ్గవిన్యాసంలో, గురి తప్పకుండా తుపాకి పేల్చటంలో ఆమె మంచి నేర్పరి. ఆమె ధైర్య సాహసాలను చూసి ప్రజలలో ఉత్సాహం ద్విగుణీకృతమయ్యేది. - ప్రత్యక్ష సాక్షుల కథనం

260