పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


చాలా వివరాలు తెలుస్తాయి. నాకొక గది ఉండేది, అని ఆమె అన్నారు. ఆనాడు తెలంగాణ పోరాటయోధులు రావి నారాయణ రడ్డి నాయకత్వంతో రజియా తన సోదరి- సోదరులతో నాయకుల ఆదేశాలను తప్పక పాటిస్తూ ఆడ మగ భేదం లేకుండ ఎటువంటి ప్రమాదకర పని అప్పగించినా, ఏమి తెలియని ప్రదశానికి వెళ్ళిరమ్మని పంపినా ఏమాత్రం అధైర్యపడకుండ ఎంతో సాహసంతో ఆ బాధ్యాతలు రజియా బేగం నిర్వర్తించారు.

ఉద్యమకార్యక్రమాలలో భాగంగా పోరాట యోధులకు ఆశ్రయం కల్పిచటం, ఆయుధలను దాచి పెట్టటం, ద్యాకారులకు అందచేయటం, ఉద్యమకారులకు సమాచారాన్ని చేరవేయటం తదితర పనులను తమ ఇంటిని, ఆ పరిసర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని రజియా బేగం నిర్వహించారు. ప్రముఖ కమ్యూనిస్టు నేతలు డాక్టర్‌ మహేంద్రా, రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మొహిద్దీన్‌, రాజ్‌ బహుద్దాూర్‌ గౌడ్‌, జవ్వాద్‌ రజ్వీ తదితరులకు ఆమె ఇంటిలో ఆతిధ్యం, ఆశ్రయం లభించింది. ఆ ఆశ్రయం నుండి నాయకులను మరింత సురక్షిత ప్రాంతాలకు చేరవేయటం లాంటి కార్యక్రమాలను పోలీసుల నిరంతర నిఘా నీడల్లో కూడ రజియా సమర్థవంతంగా నిర్వహించారు.

1951 ప్రాంతంలో తెలంగాణ సాయుధా పోరాటాన్ని విరమించాలా? కోనసాగించాలా? అను అంశం చర్చనీయాశంమెంది. ఆ సమయంలో, అఖ్తర, గోపాలన్‌ ( ఎ.కె. గోపాలన్‌), జ్యోతిబసు, ముజఫర్‌ అహమ్మద్‌తో ఏర్పడిన డెలిగేషన్‌ కి వచ్చి- 1951లో సాయుధ పోరాటం కొనసాగించాలా? విరమించాలా? అనే విషయం చర్చించడనికి వచ్చారు... ఆ విషయం గురించి చాలా రాత్రి వరకు మీటింగులు, చర్చలు జరిగేవి అని ఆమె వివరించారు. ఈ విషయంలో తన తండ్రి ఎంతో సహకరించారని వచ్చిన నాయకులకు రజియా కుటుంబం తమ ఇంటి ముందుగల గృహంలో బస ఏర్పాట్లు చేశారని ఆమె వెల్లడించారు.

తెలంగాణ పోరాటం ముగిశాక పార్టీలో కొంత మేరకు స్తబ్దత ఏర్పడింది. ఆ తరువాత ఎన్నికలు రావటంతో రజియా ఆ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. సోదరి జమాలున్నీసా బాజితో కలసి ఆమె ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. చదువు మీద, మహిళా అభ్యున్నతి కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి సారించారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు వివిధ వృతులలో శిక్షణ, మహిళలలో చైతన్యం కలిగించేందుకు

258