పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు


వివరిస్తూ, 1941లో అభ్యుదాయ రచయితల సంఘం అని ఒకటి వుండేది. మఖ్దూం, నజర్‌ హైదారాబాద్‌ ఎప్పుడూ వస్తూండేవారు. మేం నలుగురు అక్కచెల్లెళ్ళం. ఈ మీటింగులకి బహిరంగంగా వెళ్ళేవాళ్ళం. అమ్మకూడ వచ్చేది. కొంతమంది చిల్‌మన్ల (చాటున) వెనుక కూర్చునేవాళ్ళు...సజ్దాద్‌ జహీర్‌, ఓంకార్‌, పర్షాద్‌ లాంటి వాళ్ళు చాలా మంది అండర్‌ గౌండ్‌లో వున్నప్పుడు మా యింట్లో వుండేవాళ్ళు, అని పేర్కొన్నారు.

ఆ పరిచయాల కారణంగా ఏర్పడిన నూతన అభిప్రాయాల వలన రజియా బేగం కుటుంబం 1942 నాటికే ఇండియా ఉద్యమంలో పాల్గొన లేదు. అయితే క్విట్ ఇండియా ఉద్యమం పట్ల సానుభూతి ఉండేదని ఆమెస్వయంగా వెల్లడించారు. 1942 ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ మీదా నిషేదం విధించిన సందర్భంగా కూడ రజియా బేగం రహాస్యంగా కమ్యూనిస్టుల కార్యకలాపాలకు తొడ్పటు అందించారు. నిజాం సంస్థానంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులే పలు ఇక్కట్లు పడుతుండగా, నిషేదిత కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరులుగా మరిన్ని కష్టాలు పడాల్సిన భయానక వాతావరణంలో కూడ రజియా బేగం కుటుంబం కమ్యూనిస్టు ఉద్యామకారులకు చేయూత నిచ్చారు.

ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూనే 1944లో రజియా బేగం యం.ఎ పూర్తి చేశారు. చదువుకుంటూనే ఆమె తన సోదరి జమాలున్నీ బాజిలో కలసి జాతీయోద్యమ కార్యక్రమాలు, కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలలో రహస్యంగా పాల్గొటూ వచ్చారు. చివరకు భారతీయులు స్వరాజ్యాన్ని సాధించుకున్నక వెనువెంటనే ఆరంభమైన ఇండియన్‌ యూనియన్‌లో నైజాం విలీనం కోసం సాగిన పోరాటంలో తనదైన పాత్ర వహించారు. ఆ పోరాటం అంతిమ దశకు చేరు తున్న సందార్బంగా అంకురించిన తెలంగాణ పోరాటంలో రజియా బేగం కుటుంబం యావత్తు పాల్గొంది. ఆమె సోదరి జమాలున్నీసా బాజి, ఉద్యామకారులైన తన అన్నదమ్ములు అన్వర్‌, అఖ్తర్‌ ఇతర సన్నిహిత బంధువులు కూడ తెలంగాణ పోరాటంలో ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ పాత్రధారులయ్యారు.

ఈ సందర్భంగా రజియాబేగం పోలీసుల దాష్టీకాలను ఎదుర్కొన్నారు.పలు మార్లు అరెస్టులకు గురయ్యారు. జైలులో కూడ గడపారు. ఈ విషయాన్నిఆమె ప్రస్తావిస్తూ ఆ రోజుల్లో చాలా మంది కామ్రెడ్లుతో పోరాటం గురించి మాట్లడేదాన్ని, జైల్లోవున్నప్పుడు, ఒక స్త్రీ కామ్రోడ్‌తో మాట్లాడేదాన్ని. ఒక డైరీ కూడ రాసేదాన్ని. ఆది దొరికితే ఇంకా 257