పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

మహేంద్ర కూడ వచ్చాడు. ఎలక్షన్ల తర్వాత ఎవరూపట్టించు కోలేదు. యువకుల్ని చైతన్యవంతుల్ని చేసి కార్యకర్తలుగా తయారుచేయడనికి ఎటువంటి గట్టి ప్రోగాం లేదు. చిన్నవాళ్ళను తేవాలి. మేమింకా ఎన్నాళ్ళు చేస్తాము ? 25,30 సంవత్సరాలు చేశాము. పార్లమెంటరీ బై ఎన్నికలప్పుడు రాజ్‌ (రాజ్‌ బహుదుర్‌ గౌడ్‌) కి చెప్పాను- ఎక్కువగా వోటు వచ్చింది ఆసిఫ్‌ నగర్‌ నుంచి-2200 దాకా, దాంట్లో 25-30 దాకా మా కుటుంబందే. రాజ్‌ అభ్యర్థి కాబ్టి మేమే తప్పనిసరిగా పనిచేయాలనుకున్నాం.

చివరి వరకు కమ్యూనిసుగా కొనసాగిన ఆమె ఆనాటి త్యాగాలను, ఈ వివరాలను తెలిపేనాటికి కమ్యూనిస్టు పార్టీపరిస్థితి, పార్టీనాయకులు వారి కుటుంబాల తీరుతెన్నులను తన కుటుంబ సభ్యు త్యాగాలతో పోల్చుతూ తన బాధను ఈ క్రింది విధంగా వ్యకంచేశారు.

ఇక, ఇప్పుడు పార్టీ లీడర్ల పిల్లల్ని చూస్తే...వాళ్ళు పార్టీకై ఏమి చేయరు. కొంత మంది మాస్కో వెళ్ళి వచ్చారు. అయితే పార్టీకేంచేశారు? నా అన్నదమ్ములా- జఫర్‌ ఆక్సిడెంటులో చనిపోయాడు. ఆన్వర్‌ చాలా కష్టాలు పడ్డాడు. జాల్నాజైలులో వున్నాడు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని తర్వాత చనిపోయాడు. ఆయన కూతురు ఎం.ఎస్‌. సి చేస్తున్నది. భార్య తర్వాత చదువుకుని ఉద్యోగం చేసింది...ఆ రోజుల్లో 500 మంది స్త్రీలను పోగుచేయగలిగేదాన్ని. ఇప్పుడు 50 మందిరారు అంటూ అమె నిరాశను వ్యక్తం చేశారు. ఈ విధంగా జాతీయోద్యమం, నిజాం వ్యతిరేకపోరాటం, తెలంగాణా రైతాంగ పోరాలలో చురుకుగా పాల్గొన్న జమాలున్నీసా చివరి వరకు ప్రజలకోసం పనిచేస్తూ గడపారు.

(ఈ వ్యాసం ప్రదానంగా 1986లో స్త్రీ శక్తి సంఘటన (హెదారాబాద్‌) ప్రచు రించిన ' మనకు తెలియని మన చరిత్ర (తెలంగాణా రైతాంగపోరాటంలో స్త్రీలు-ఒక సజీవ చరిత్ర) ' గ్రంథంలోని జమాలున్నీసా బాజి, ఆమె సోదరి రజియా బేగం తమ ఇంటర్యూలో వెలిబుచ్చిన సమాచారం ఆధారంగా రూపొందించటం జరిగింది. ఆ గ్రంథం సంపాదకులు, ప్రచురణకర్తలకు నా ధన్యవాదాలు. - రచయిత.)

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

ఐక్యంగా ఉండమని మనకు పలు అనుభావాలు నేర్పుతున్నాయి,ఈ దేశంలోని హిందూ -ముస్లిం- శిక్కు- ఈశాయి ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించనట్లయితే మన లక్ష్యం ఏనాటికి సిద్దించజాలదు. - ఆబాది బానో బేగం ♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

248