పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


పాల్గొనేట్టుగా చేయటంలో ఆమె దిట్టగా ఖ్యాతిగడించారు. ఈ విశిష్టతను గమనించిన జాతీయ కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేకంగా జనచైతన్య కార్యక్రమాల బాధ్యాతలను ఆమెకు అప్పగించారు.

బేగం ఫాతిమా 1939 నుండి 1940 వరకు పంజాబ్‌ రాష్ట్రమంతా పర్యిస్తూ జాతీయోద్యమ లక్ష్యాలను, స్వరాజ్యం సాధించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటంలో ప్రజలను కార్యోన్ముఖులను చే టంలో అద్వితీయ ప్రతిభను కనపర్చారు. ఆమె ఆకర్షణీయమైన విగ్రహం, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ప్రజలను తనవైపుకు ఇట్టే తిప్పుకునేవారు. విషయ వివరణ, ప్రత్యర్థుల వాదనను తిప్పికొడుతూ సాగించే సంవాదమ్, ప్రత్యర్థ్ధులను సహితం సమ్మోహితులను చేయటం ఆమె విశిష్టత.

భారత జాతీయ కాంగ్రెస్‌ ఆదేశాల మేరకు రాష్రంలో పలు సభలను, సమావేశాలను ఆమె ప్రతిభావంతంగా నిర్వహించారు. స్వయంగా ఆమె మంచి వక్త కావటంతో ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరిలో స్వరాజ్య కాంకను రగిలించారు. స్వరాజ్య సాధనా మార్గంలో ధనమాన ప్రాణాలను అర్పించేందుకు ప్రజలను సన్నద్దం చేశారు. స్వాతంత్య్ర సంగ్రామ పోరాటయోధులను సమీకరించటం, నిబద్ధత గల ఉద్యామకారులను ఎంపిక చేయటంలో దిట్టగా ఆమె జాతీయ నాయకుల ప్రశంసలు పొందారు.

ఆ రోజుల్లో ఉద్యామకారుల మీద బ్రిటీష్‌ గూఢచారి దాళం ఎల్లప్పుడూ తీవ్ర నిఘా ఉంచేది. బ్రిటీష్‌ పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా వారి కన్నుగప్పి ఆమె తన కార్యకలాపాలను నిరాఘాటంగా సాగించారు. జాతీయ కాంగ్రెస్‌ ఆదేశాల మేరకు పంజాబ్‌ శాఖ అప్పగించిన బాధ్యాతలన్నింటినీ చాకచక్యంగా నిర్వహించిన ఫాతిమా బేగం జీవిత విశేషాలు చరిత్రపుటలలో సమగ్రంగా నిక్షిప్తం కాలేకపోయాయి.

జాతీయోద్యమ నాయకుల సంభాషణలలోని ప్రస్తావనలు, నేతలు పరస్పరం రాసుకున్న లేఖలలో దొర్లిన వాక్యాలు, ఆమె కార్యకలాపాలతో పరిచయం ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు డక్టర్‌ హషీం కిద్వాయ్‌ లాంటి పెద్దలు వెల్లడించిన వివరాల ద్వారా మాత్రమే ఫాతిమా బేగం ప్రశంసనీయ పాత్రకు సంబంధించిన విశేషాలు నమోదు కాగలిగాయి.

234