పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


ప్రధానంగా గత మూడు సంవత్సరాలుగా సేకరించిన అదనపు సమాచారంతో విషయపరంగా ఈ పుస్తకాన్నిసరికొత్తదిగా రూపొందించ ప్రయత్నించాను. ఈ మధ్యకాలంలో నేను సేకరించిన చిత్రాలు, ఫోటోలు పుస్తకంలో సమకూర్చాను. ఈ పుస్తకాన్ని విషయపరంగా మాత్రమే కాకుండ రూపం పరంగా కూడ ఆకర్షణీయంగా తీర్చిది ద్దాను.ఆ కారణంగా పుస్తకం పరిమాణం బాగా పెరిగింది.ఈ గ్రంథం రూపు దిద్దు కోవడంలో తమ సహకారం అందించిన తెలుగు ఇస్లామిక్‌ పబికషన్స్‌ , డెరకర్‌ జనాబ్‌ అబ్బాదాుల్లా గారికి, చక్క ని పరిచయ వాక్యం రాసిచ్చిన ప్రొఫెసర్‌ టి. జ్యోతిరాణి (కాకతీయ విశ్వవిద్యాలయం), ప్రశంసా వాక్యంతో ప్రోత్సహించిన డా. ఆవుల మంజులత (వైస్‌ ఛాన్సలర్‌, ప్టొి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యా లయం, హైదారాబాద్‌) గారికి చరిత్ర రచన విషయంలో నాకు అవసరమగు సమాచారం. అందిస్తూ, ఆ దిశగా రచనలు చేయమని ననుfl ప్రోత్సహిస్తు, ఆప్తవాక్యం రాసిచ్చిన ప్రముఖ రచయిత, చరిత్ర పరిశోధాకులు డక్టర్‌ అస్గర్‌ అలీ ఇంజనీర్‌ (ముంబాయి) గారికి కృతజ్ఞతలు.నా కృషిలో సహకరించిన సోదారులు జనాబ్‌ అబ్దుల్‌ వాహెద్‌ (గీటురాయి -హైదారాబాద్‌), ప్రముఖ సాహితీవేత్త శ్రీ కొత్తపల్లి రవిబాబు (విజయవాడ), చరిత్రోపన్యాసకులు జనాబ్‌ మహబూబ్‌ బాషా (అంబేద్కార్‌ విశfiవిద్యాలయం, లక్నో), సద్విమర్శకులు శ్రీ పెద్ది సాంబశివరావు (గుంటూరు), కవి మిత్రులు డక్టర్‌ ఇక్బాల్‌ చాంద్‌ (సత్తుపల్లి) గార్లకు ధాన్యవాదాలు.నా ప్రయత్నాలకు తొలి నుండి శుభాశీస్సులు అందిస్తు నన్ను ప్రోత్సహిస్తున్న ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ ఛైర్మన్‌ జనాబ్‌ షేక్‌ పీర్‌ అహమ్మద్‌ (నరసరావుపేట),పలు ఉర్దూ గ్రంథాలను చదివి అందాులో నాకు ఉపయుక్తమగు సమాచారాన్ని నాకు తెలియపర్చుతూ నన్ను ఆశ్వీ రదిస్తున్న మా అమ్మ సయ్యద్‌ బీబీజాన్‌, నా ప్రతి ప్రయత్నం వెనుక తానుండి సతతం నన్ను ప్రొత్సహిస్తు అన్ని విధాల నాకు తోడుగా నిలచి సహకరిసున్ననా జీవిత భాగస్వామి షేక్‌ రమిజా బానుకు ప్రత్యేక ధాన్యవాదాలు.ఈ గ్రంథా రచయితను నేనైనా, సమాచార సేకరణ వద్దనుండి, ఆ సమచారాన్ని పుస్తకం రూపం కల్పించి పాఠకులకు అందించగలిగించేంత వరకు సాగిన ప్రకియలో పలువరురు ప్రముఖులు సన్మిహితులు, మిత్రులు ప్రత్యక∆ంగా సహకరించినా, పరోక్షంగా చేయూతనిచ్చినవారు పలువురున్నారు. ఆ కారణంగా ఈ గ్రంథం 'వ్యష్టి కృషి' కంటె 'సమష్టి కృషి' ఫలితమని భావిస్తున్నాను.

నవంబర్‌, 2006 వినుకొండ.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

18