పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

కారణమయ్యాయి. ముస్లింలీగ్‌ నేతల మారదర్శ కత్వంలో సాగిన ఆ సమావేశంలో సుల్తానా హయాత్‌ వాదనలు వీగిపోయాయి. ముస్లిం అయిఉంటే ముస్లింలీగ్‌లోకి చేరు అంటూ సమావేశంలో ఒత్తిడి వచ్చినా జాతీయోద్యమకారుల వారసులైన ఆ సోదరీమణులు ఆ ఒత్తిడులకు తలవొగ్గలేదు.

1942లో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమంలో నాటికి యువతిగా రూపాంతరం చెందిన బేగం సుల్తానా హయాత్‌ ఉద్యమంలో పాల్గొనటం ఆరంభించారు. ఆనాడు ముస్లిం మహిళలేంటి మహిళలందరి మీద ఆంక్షలు ఉండేవి. మహిళలు పరోక్షంగా సహాయ సహకారాలు అందిచటం వరకు కార్యకలాపాలు పరిమితం. ఆ కారణంగా ఆమె పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌ కార్యక్రమాలలో నిమగ్నం కాలేకపోయారు. అందువల్ల ఆమె కూడ ప్రత్యక్షంగా కార్యక్రమాలలో పాల్గొనకుండ పరోక్షంగా ఉద్యామకారులకు సహాయపడటం కోసం తనదైన కార్యకలాపాలను రూపొందించుకున్నారు.

జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు ప్రదర్శనలు, పికెటింగ్‌లు, ఊరేగింపులు, శాసనోల్లంఘన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా పోలీసుల దాష్టీకాలకు గురైన ఉద్యామకారులకు సేవలందించడనికి సుల్తానా హయాత్‌ అత్యధిక ఆసక్తి చూపారు. ఈ మేరకు యువతులతో ఒక సేవాదళాన్ని స్థాపించారు. ఈ దళం ఒకవైపు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే, మరొక వైపు బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని చికాకు పర్చే చర్యలను ఎంతో సాహసోపేతంగా సాగించింది. బ్రిటీష్‌ పోలీసుల మీద సదా కన్నేసివుంచి, అధికారుల రాకపోకల గురించి ఎప్పికప్పుడు తెలుసుకుంటూ ఆ సమాచారాన్ని ఉద్యమకారులకు తెలపటమేకాక ఉద్యమ కొరియర్లగా కూడ ఆమె పర్యవేక్షణలో దళ సభ్యులు పనిచేశారు.

ఈ సందర్భంగా ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితుల నుండి బయట పడేందుకు యువతులు ఆయుధాలను ధరించాలని, ఆత్మరక్షణ కోసం పోరాట పద్దతులను యువతులకు నేర్పాలని బేగం సుల్తానా నిర్ణయించారు. ఆ మేరకు తాత ఖాజీ నజీముద్దీన్‌ సహకారంతో సేవాదళ సభ్యులందరి కోసం ప్రత్యేకంగా ఆయుధాలను తయారు చేయించి, వాటిని ప్రయాగించడంలో కూడ శిక్షణ ఇప్పించారు. అనివార్య పరిస్థితులలో ఆత్మాహుతి చేసుకోడానికి కూడ సభ్యులు సన్నద్ధంగా ఉండేట్టుగా మానసికంగా వారిని తయారు చేశారు. అయితే ఆ తరువాతి కాలంలో ఆత్మహత్య నిర్ణయం తప్పుడు నిర్ణయమని ఆమె

204