పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్పించుకున్నారు. ఆమె తాత గారి ప్రత్యేక శిక్షణలో చిన్న చిన్న ప్రసంగాలు చేయటం కూడ అలవాటు చేసుకున్నారు. ఆనాడు మీర్‌లోని జుమా మసీదులో ఆమె అధ్బుత ప్రసంగం చేసి బడాబడా నేతలను అబ్బురపర్చారు.

చిన్ననాటనే నాయకత్వం లక్షణాలను ప్రదర్శించి తన ఈడు పిల్లలతో కలసి ప్రత్యక దళాన్ని ఏర్పాటు చేసు కుని సబలు, సమావేశాలు జరుగునప్పుడు ఆ కార్యక్రమాలకు విచ్చేసిన నేతలకు, సభికులకు సేవలందించటం ఆమె అలవాటు. ఈ క్రమంలో ఆమె జాతీయ కాంగ్రెస్‌ స్వచ్చంద సేవికల దళాలకు నాయకత్వం వహించారు. ఆమె విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు పాఠశాలలో ప్రత్యేకంగా ఫిజికల్‌ ట్రైనింగ్‌ పొంది ఉన్నందున ఆ స్వచ్ఛంద సేవికల దళాల ఫిజికల్‌ ఫిట్‌నెస్ కోసం ప్రత్యేక శిక్షణ తరగతులను కూడ ఆమె నిర్వహించారు. యవతులకు లాఠీ తిప్పటం నేర్పారు. ఈ మేరకు మీరట్‌ నగరంలోని పలు సంఘాలు సంస్థలు, జాతీయ కాంగ్రెస్‌ నాయకులు, మహిళా నేతలు ఆమె సేవలను ఉపయోగించుకున్నారు.

ఆమె ధార్మికంగా నిష్టాగరిష్టురాలైనప్పికి విభిన్న మతస్థులు కలసిమెలసి జీవిస్తున్న వాతావరణంలో సర్దుబాట్లు అవసరమని భావించారు. ఉద్యమాలను, పోరాటాలను మతం ఆసరాతో, మతం పేరుతో రూపొందించడాన్ని వ్యతిరేకించారు. హిందూ-ముస్లింల ఐక్యతకు ఈ చర్యలు విఘాతం కల్గించగలవని అభిప్రాయపడ్డారు. ముస్లింలకు ప్రత్యేక సంఘాలు, రాజకీయ పార్టీల ఏర్పాటును నిరసించారు.

1933-34 ప్రాంతంలో ఢిల్లీలోని అరబిక్‌ కళాశాలలో ముస్లిం మహిళల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరికి ఆహ్వానాలు వెళ్ళాయి. ఆ ఆహ్వానాల మేరకు ప్రముఖ మహిళా నేతలు సమావేశాలకు విచ్చేసారు. ఆ సమావేశాలలో మీరట్ ప్రతినిధులుగా సోదరి జెహరా బేగంతో కలసి బేగం సుల్తానా హయాత్‌ పాల్గొన్నారు. ఆ సమావేశంలో ప్రకటించిన ఉద్దేశ్యానికి భిన్నంగా ముస్లిం విద్యార్థినుల కోసం ముసిం విద్యార్థినుల సమాఖ్య ఏర్పాటుకు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. ఆ ప్రయత్నాలు సుల్తానా సోదారీమణులకు నచ్చలేదు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సుల్తానా హయాత్‌, ఆమె చెల్లెలు బేగం జొహరా బేగం తీవ్రంగా ప్రతిఘిటించారు. ఆ తీర్మానం తగదంటూ ఆమె వాదన ప్రవేశపెట్టారు. ఆ ప్రతిఘటన, ఆమె సాగించిన సంవాదం సమావేశంలో సుదీర్ఘ చర్చకు

203