పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


చేశాడు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Yogdaan : Page. 272)

ఆ జియావుద్దీన్‌ కుమారుడు ఖాజీ నజీముద్దీన్‌ కూడ జాతీయోద్యమకారుడు. బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్‌ మార్గదర్శకంలో ఉద్యమించారు. మీర్‌ నగరంలోగల తమ కుటుంబ భవంతిలో కొంత భాగాన్ని ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమ కార్యాలయాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భారత జాతీయ కాంగ్రెస్‌కు దాఖలు చేశారు. మీర్‌ నగర కాంగ్రెస్‌కు 27 సంవత్సరాల పాటు అధ్యక్షుకునిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు.(Encyclopedia of Muslim Biography, Nagendra Kumar Singh APHPC, New Delhi, 2001, Page. 485)

ఆ నజీముద్దీన్‌ బాటలో ఆయన కుమారుడు ఖాజీ బషీరుద్దీన్‌ నడిచారు. ఆయన కూడ జాతీయోద్యామ్యంలో పాల్గొన్నారు. ఆ ఖాజీ బషీరు ద్దీన్‌ కుమార్తె సుల్తానా హయాత్‌. ఈ విధంగా ముత్తాత ప్రథామ స్వాతంత్య్రసంగ్రామ యోధుడు కావటం, తాత, తండ్రి జాతీయ కాంగ్రెస్‌ ప్రముఖులు కావటంతో స్వేచ్ఛా-స్వాతంత్య్ర భావనలు సుల్తానాకుచిన్ననాటనే పరిచయమయ్యాయి. తాత ఖాజీ నజీముద్దీన్‌ సుదీర్ఘకాలం భారత జాతీయ కాంగ్రెస్‌ మీర్‌ నగర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించటం వలన ఆయన ఇంటికి పండిత మోతీలాల్‌ నెహ్రూ, మౌలానా ముహమ్మద్‌ అలీ, మౌలానా షౌకత్‌ అలీ, కమలాదేవి చోపాధ్యాయ, మౌలానా అబుల్‌ కలాం అజాద్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ˙, మౌలానా అతావుల్లా బొఖారి, డాక్తరు సైఫుద్దీన్‌ కిచూ,మౌలానా హఫజు ర్రెహమాన్‌ లాంటి ప్రముఖుల రాకపోకలు ఉండేవి. ఆ కారణంగా తాత దగ్గర ఉంటూ, ఆయనకు, ఆయన అతిథులకు సపర్యలు చేస్తూ గపిన సుల్తానా హయాత్‌కు చిన్ననాటనే ప్రముఖ నాయకుల పరిచయం కలిగింది.

ఆ పరిచయాలు, ఆ ప్రత్యేక రాజకీయ వాతావరణం సుల్తానా హయాత్‌లో సమరశీల భావాలకు అంకురార్పణ చేశాయి. ఆమె ఇంటిని తరుచుగా పోలీసులు వచ్చిసోదాలు నిర్వహించటంతో ఆమెకు పోలీసుల భయం లేకపోగా, బ్రిటిషు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బాగా పెరిగింది. చిన్నతనంలోనే ఆమె తాత ఖాజీ నజీముద్దీన్‌తో కలసి కాంగ్రెస్‌ సభలలో పాల్గొంటూ వచ్చారు. ఆ సభలలో తన సుమధుర కంఠంతో జాతీయభావాలతో నిండిన, దేశభక్తియుత కవితలు విన్పిస్తూ సభికులచే శభాష్‌ 202