పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


కళశాలలో అధ్యాపకు రాలిగా బాధ్య తలు స్వీకరించారు. ఆ కళాశాలలో ఒక వైపు న ఉద్యోగం చేస్తూమరొకవైపు న పి.సి. జోషి తదితర ప్రముఖ ఉద్యమకారులతో కలసి కమ్యూనిస్టు పార్టీ రహస్య కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు. 1935లో ప్రముఖ కవి సజ్దాద్‌ జహీర్‌తో కలసి అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు, ప్రథమ సమావేశం నిర్వహణలో పాల్గొని ఆమె ఆ సంఘ వ్యవస్థాపక సభ్యురాలయ్యారు.

1935లో ప్రముఖ విద్యావేత్త, కమ్యూనిస్టు నాయకుడు డాక్టర్‌ జైనుల్లాద్దీన్‌ అహమ్మద్‌ను హాజౌరా వివాహమాడారు. డాక్టర్‌ జడ్‌.ఎ. అహమ్మద్‌గా ప్రసిద్ధుడైన ఆయనను ఆమె తొలుత లండన్ లో కలుసుకున్నారు. డాక్టర్‌ అహమ్మద్‌ ఇండియా వచ్చాక ఆయన కూడ కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ ఆమెకు సన్నిహితులయ్యారు. ఆ వివాహం 1935 మే 20న సయ్యద్‌ సజ్దాద్‌ జహీర్‌ తండ్రి లక్నో హైకోర్టు ప్రధాన న్యాయాధికారి సయ్యద్‌ వజీర్‌ హస్‌ గృహంలో జరిగింది. ఆనాటి నుండి భార్యభర్తలు అటు స్వరాజ్య సాధన, ఇటు శ్రమజీవుల సంక్షేమం కోసం ఉద్యమించారు.

1935 ప్రాంతంలో బేగం హాజౌరా, డాటర్‌ జైనుల్లాబిద్దీన్‌లు భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించారు. రహస్యంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆ దంపతులు పోలీసు అధికారుల దృష్టిలో పడ్డారు. ఆ కారణంగా ఉద్యోగాలకు రాజీనామా ఇచ్చి పూర్తికాలపు ఉద్యమకారులయ్యారు.డాక్టర్‌ భరద్వాజ్‌ నాయకత్వంలో సజ్దాద్‌ జహీర్‌, డాక్టర్‌ అష్రాఫ్‌, డాక్టర్‌ జడ్‌.ఎ. అహమ్మద్‌ లతో కలసి పోలీసుల కళ్ళుగప్ప నిషేధిత కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలతోపాటుగా భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలను కూడ ఆమె సమర్థ్ధవంతంగా నిర్వహించారు.

కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం తొలిగాక పార్టీకి సామాన్య మహిళా కార్యకరలు ఉండటమే అరుదైన ఆ రోజులలో బేగం హాజౌరా పార్టీ నాయకురాలిగా బాధ్యతలు చేప్టి నిర్భయంగా నిర్వహించటం విశేషం. ఉత్తరప్రదేశ్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రథమ సమావేశం నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించిన ఆమె ఆ తరువాత అలహాబాద్‌ కమిటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.

1936లో పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షులయ్యాక అఖిల భాతర జాతీయ కాంగ్రెస్‌ను వ్యవస్థాపరంగా బలోపేతం చేయదలచుకున్నారు. ఆ పథకంలో భాగంగా జాతీయ కాంగ్రెస్‌కు పలు అనుబంధ సంస్థలను ఆయన

198