పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

మనన్న పొందారు. (మేరే జీవన్‌ కీ కుచ్‌ యాదేౌ (హిందీ), డాక్టర్‌ జడ్‌.ఎం. అహ్మద్‌, భారత కమ్యూనిస్ట్‌ పార్టీ, లక్నో, 1997, పేజీ.132) బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యోధుల గురించి చిన్ననాటనే హజౌరా బేగం విన్నారు. పోలీసు అధికారి అయిన తండ్రితోపాటుగా ఆమె మీర్‌ నగరంలో ఉన్నారు. ఆ సమయంలో మీర్‌ కుట్రకేసుకు సంబంధించిన విప్లవకారులను నిర్భంధాంలోకి తీసుకుని ఆమె నివాసం ఉంటున్న బంగ్లా ప్రాంతంలో ఉంచటం జరిగేది. ఆ వాతావరణాన్ని గమనించిన ఆమెకు ఆ విప్లవకారులు ఎవరన్న విషయం మీదా ఆసక్తి పెరిగి తండ్రిని అడిగారు. ఆయన సమాధానం చెప్పకున్నా వార్త్తాపత్రికల ద్వారా వారంతా బ్రిటీషు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న యోధులని తెలుసుకున్నారు. ఈ మేరకు తొలిసారిగా బ్రిటీషు ప్రభు త్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న యోధుల పరోక్ష పరిచయం ఆమెకు లభించింది.

ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా అబ్దుల్‌ జమీల్‌ ఖాన్‌తో హాజౌరా వివాహం జరిగింది. ఆ వివాహ బంధం ఎంతోకాలం నిలువలేదు. భర్త అబ్దుల్‌ జమీల్‌ ఖాన్‌ ఉన్నత స్థాయి పోలీసు అధికారి కావటంతో జాతీయ, స్వతంత్రభావాలు గల హాజౌరాకు అతనితో కుదరలేదు. అప్పికి ఆ దంపతులకు సమీఖాన్‌ అను కుమారుడు కలిగాడు. కుమారుడు కలిగినా కూడ ఆ పోలీసు భర్తతో ఆమెకు పొసగకపోవటంతో తండ్రికి విషయం తెలిపి 1932లో భర్త నుండి విడాకులు తీసుకున్నారు.

ఆ తరువాత తండ్రి ప్రోత్సాహంతో1933లో తన బిడ్డతో సహా విద్యాభ్యాసం కోసం హాజౌరా లండన్‌ వెళ్ళారు. లండన్‌లోని మాంటిస్సోరి కళాశాలలో విద్యాభ్యాసం సాగించారు. ఇంగ్లాండులో జాతీయ భావాలు, సామ్యవాదా భావాలు గల సజ్దాద్‌ జహీర్‌, జెనుల్లాబిదీన్‌ లాంటి యువకుల బృందంతో ఆమెకు పరిచయం కలిగింది. ఆ పరిచయం ద్వారా కమ్యూనిస్టు సాహిత్యాన్ని అధ్యాయనం చేసిన ఆమె సామ్యవాద సిద్దాంతం పట్ల అభిమానం, బ్రిటీషు సామ్రాజ్యవాద శక్తుల పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు.

మాతృదేశం నుండి బ్రిటీష్‌ సామ్రాజ్యవాద శక్తులను వెళ్ళ గొట్టెందుకు శ్రమించాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సభలు, సమావేశాలు, చర్చలలో పాల్గొని బ్రిటీష్‌ సామ్రాజ్యవాదం, యుద్ధకాంక్షకు వ్యతిరేకంగా మాట్లాడి, ప్రసంగాలు చేసిన హాజౌరాకు బ్రిటీషు వ్యతిరేక ఉద్యామకారులలో ప్రత్యేక గుర్తింపు 196