పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాతీయోద్యమకారుల, శ్రమజీవుల అక్కయ్య

హాజఁరా ఆపా

(1910-)

భారత జాతీయోద్యమంలో భాగస్వాములైన పలువురు మహిళలు ఒకవైపున బ్రిటిషర్ల నుండి మాతృదేశాన్ని విముక్తం చేయటం కోసం పోరాడుతూనే, స్వతంత్ర భారతంలో శ్రమజీవుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆ దిశగా అవిరళ కృషి సాగించారు. ఈ మేరకు అటు పరాయిపాలకులతో, ఇటు స్వదేశంలోని కార్మిక-కర్షక జనావళి సంక్షేమం కోసం అసమానతలకు వ్యతిరేకంగా అహర్నిశలు పోరాటాలు సాగించి ఉభయ పాత్రలను సమర్ధవంతంగా పోషించిన మహిళా ప్రముఖులలో అగ్రగణ్యులు శ్రీమతి హాజౌరా బేగం.

జాతీయోద్యమకారులు, శ్రమజీవులచే ఎంతో ఆప్యాయంగా హాజౌరా ఆపా (హజరా అక్కయ్య) అని పిలిపించుకున్న హాజౌరా 1910 డిసెంబరు 22వ తేదిన ఉతర ప్రదశ్‌ రాష్ట్రం షహరనపూర్‌లోని సంపన్న కుటుంబంలో జన్మించారు. ఈ ప్రాంతం అప్పుడు రాంపూరు సంస్థానంలో ఉండేది. ఆమె తండ్రి ముంతాజుల్లా ఖాన్‌ డిప్యూటి కలక్టరు. నవాబు వంశస్థురాలు కావటంతో ఆమె క్వీన్‌ మేరీస్‌ కళాశాల లాంటి ప్రసిద్ధిగాంచిన విద్యాసంస్థలలో చదువుకున్నారు. చిన్నప్పటినుండి ఆమె ఆటపాటలతో పాటుగా చదువులో అగ్రగామి. కళాశాలలో ఆమె చాలా చురుకైన విద్యార్థినిగా అధ్యాపకుల

195