పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

కార్యక్రమాల నిర్వ్హణకు తొందర పడవద్దు. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని సూచించారు. ఆ సూచన ఆమె నిర్ణయాన్ని ప్రభావితం చేయలేకపోయింది. ఆమె నిర్దేశించుకున్న దిశగా ముందుకు సాగిపోయారు. అనారోగ్యం కూడ లెక్కచేయక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న ఆమె కృషిని గమనించిన గాంధీజీ తన సన్నిహితులకు, మిత్రులకు రాసిన ఉత్తరాలలో అమతుస్సలాంను ప్రశంసావాక్యాలతో ముంచెత్తారు .

1944 ప్రాంతంలో ముహమ్మద్‌ అలీ జిన్నాను గాంధీజీ QAID-I-AZAM అని సంబోధించడంలో ఆమె ప్రధాన పాత్ర వహించారు. ఈ విషయాన్ని మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ తన ఇండియా విన్స్‌ ఫ్రీడంలో పేర్కొన్నారు. ముహమ్మద్‌ అలీ జిన్నా ఇంటర్యూను కోరుతూ మహాత్ముడు జిన్నాకు లేఖ రాస్తున్న సందర్భంగా, QAID-IAZAM అని జిన్నాను సంబోధించాల్సిందిగా అమతుస్సలాం గాంధీజీని సలహా ఇచ్చారు. ఆ విధమ్గా ఉర్దూ పత్రికలు సంబోధిస్తున్నాయని అమె ఆయనకు తెలిపారు. ఆ సలహా పరిణామాలను ఆలోచించకుండ జిన్నాను మహాత్ముడు QAID-I-AZAM అని తన లేఖలో సంబోధించటంతో జిన్నా వ్యక్తిగత ప్రతిష్ట అనూహ్యంగా పెరిగింది. అది భారత రాజకీయాలలో పెనుమార్పుకు కారణమయ్యిందని ంఓఊలానా పేర్కొన్నారు.(India Wins Freedom, Maulana Abul Kalam Azad, Orient Longman, Hyderabad, 1995, Page. 96-97) ఈ విధగా అమతుస్సలాం భారతదశ చరిత్రలోని ఓ కీలక సమయంలో తనదెన పాత్రను పోషించి చరిత్రమలుపుకు కారణమయ్యారు.

మహాత్ముని బాటన జాతీయోద్యమంలో నడిచిన బీబీ అమతుస్సలాం హిందూ, ముస్లిం ఐక్యతా చిహ్నమయ్యారు. మతకలహాలను నివారించేందుకు ఆమె నిరంతరం కృషి సల్పారు. మత ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ఆమె ఎంతో సాహసంగా వెళ్ళి ఆ కల్లోలిత ప్రాంతాల ప్రజలను ఆదుకున్న ఘటనలు ఉన్నాయి. వాయువ్య సరిహద్దులు, సింధ్‌, నౌఖాళి ప్రాంతాలలో మతకలహాలు విజృంభించినప్పుడు మత సామరస్యం ప్రబోధించేందుకు తన ప్రత్యేక దూతగా గాంధీజీ ఆమెను పంపారు.

వాయవ్య సరిహద్దులలో భయంకర మతఘర్షణలు ఉదృతంగా సాగుతున్నప్పుడు ఆ ప్రాంతాలకు ఆనేక కష్టనష్టాలకోర్చి ఆమె వెళ్ళారు. దట్టమైన అడవుల గుండ గుర్రం మీదా స్వారి చేస్తూ మతకలహాల బారిన పడిన ప్రాంతాలకు వెళ్ళి అన్ని వర్గాల ప్రజానీకంతో కలసి పోయి హిందూ ముస్లింల ఐక్యతను సాధించటంలో ఆమె చూపిన తెగువ నేర్పు ప్రతి ఒక్కరి ప్రశంసలందుకుంది. 191