పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు


నా ఇబ్బంది ఏమిటంటే నాకెవ్వరూ తెలియదు. బాపూతో కూడ ఎప్పడూ కలవలేదు. తరచుగా మీరాబెన్‌ పేరు మాత్రం చదివాను. ఆమెకు లేఖ రాశాను. చాలా కాలం ఎదురు చూశాక, మీరు ఇక్కడకు రావటంలో

ఉద్దేశ్యం ఏమిటి అని ప్రశ్నిస్తూ , మా ఇంటి విషయాలు అడుగుతూ ఆశ్రమ నిర్వహకులు నారాయణ దాస్‌ గాంధీ నుండి ఉత్తరం వచ్చింది. ఇంటిలో ఎవ్వరూ బాధపడరు కదా అంటూ నా ఆరోగ్యంగురించిన మెడికల్ సర్టిఫిక్‌ట్ ను ఆయన అడిగారు. అబద్ధాలుచెప్పిఫ్యామిలీ డాక్తరు నుండి తప్పుడు సర్టిఫిక్‌ట్ సంపాదించి ఆశ్రమంలో చేరటం ఆనాడు అమతుస్సలాంకు అంత కష్టం కాదు. అయినా ఆమె నిజాలు నిర్భయంగా తెలిపి ఆశ్రమంలో చేరాలనుకున్నారు. ఆపాటి కి ఆమెను ప్టిపీడిస్తున్న టి.బి. తగ్గిపోయింది. ఆ విషయం పేర్కొంటూ సర్టిఫికేటు ఇవ్వాల్సిందిగా ఆమె తమ కుటుంబ డాక్టర్‌ను ఆభ్యర్థించి సర్టిఫికెట్ సంపాదించారు. ఆ సర్టిఫికేటులో నాలుగు ఏండ్ల నుండి ఆమె నా వద్ద టి.బి. వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. ప్రస్తుతం ఆ వ్యాధి నయమైంది. అయితే ఆమె దేహం ఆశ్రమ నియమనిబంధనలకు తట్టుకోలేదు అని డాక్టర్‌ రాశారు. ఆ సర్టిఫికేటుతో తన అభ్యర్థ్ధన పత్రాన్ని ఆమె సబర్మతీ ఆశ్రమం పంపారు. ఆ అభ్యర్ధన పత్రంతోపాటుగా మీతోపాటుగా నేను కూడ దేశ సేవ చేయాలను కుంటున్నాను. శారీరక బలం లేని కారణంగా నాకు అనుమతి లభించటంలేదు. ఈ విషయ మై మీరు దయ ఉంచాలి అని గాంధీజీని వేడు కుంటూ అమతుస్సలాం ప్రత్యేకంగా లేఖ రాశారు. ఆ తరువాత కూడ చాలా కాలంవరకు ఆశ్రమం నుండి జవాబు రాలేదు. 189