పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

జాతీయోద్యమం విజయవంతం కావాలంటే మహిళల్లో చైతన్యం రావాలనీ అది అక్షర జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్య మైతుందని ఆమె విశ్వసించారు. ఈ మేరకు తన విశ్వాసాన్ని ఆచరణలో చూపేందుకు ఎంతగానో శ్రమించారు. ప్రజలలో అకర జ్ఞానం కలించేందుకు ప్రచార కార్యక్రమాల కంటే విద్యవ్యవస్థల నిర్మాణం ద్వారా ఆ లక్ష్యాలు సాధ్యా మైతాయని ఆమె తలంచారు. ఈ మేరకు 1930లో అలహాబాద్‌లో ఆడపిల్లలు, మహిళల కోసం హమీదియా బాలికల సెకండరీ స్కూల్‌ (Hamidiya Girls Secondary School) స్థాపించారు. ఆ విద్యాసంస్థ ఆమె కళ్ళ ఎదుట మహిళలలో విద్యాసుగంథాలను వెదజల్లుతూ క్రమక్రమంగా కళాశాల స్థాయికి ఎదిగింది.

ఖద్దరు ప్రచార కార్యక్రమాలలో ఆమె అత్యంత ఆసక్తి చూపారు. ఆశయాలను ఆచరణలో చూపటం ద్వారా ప్రజలను ఆకర్షించారు. స్వయంగా ఖద్దరు ధారణ చేశారు. నూలు వడకటం మాత్రమే కాకుండ, నూలువడకడాన్ని అమె ప్రజలకు, ప్రధానంగా మహిళలకు, యువతులకు నేర్పారు. జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులకు కూడ ఆమె నూలు వడకటం నేర్పారని గాంధీజీ లేఖల ద్వారా వెల్లడవుతుంది.

మాతృభూమి విముక్తి కోసం ఉద్యమించిన ఫలితంగా బ్రిష్‌ సామ్రాజ్య వాదుల నుండి దేశానికి విముక్తి లభించినప్పటికి, దేశం విభజనకు గురవటం పట్ల బేగం ఖుర్షీద్‌ బాగా కదలిపోయారు. ఆనాటి నుండి రాజకీయ రంగం నుండి వైదొలగి విద్యా, సామాజిక సేవారంగాలకు ఆమె అంకితమయ్యారు. ఈ మేరకు అటు మాతృదేశ సేవ, ఇటు ప్రజాసేవకు అమూల్యమైన జీవితాన్ని అర్పితం చేసిన సమరశీల యోధురాలు బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా 1981 జులైలో తుదిశ్వాస విడిచారు.

♦♦♦

బ్రిటిష్‌ న్యాయస్థానం ఎటువంటి శిక్షనైనా విధించనివ్వండి, అది జైలు శిక్ష, బహిష్కరణ, జీవిత ఖైదు, ద్వాపాంతరవాసం, చివరకు ఉరిశిక్ష అయినా కానివండి, తల వంచాల్సిన అవసరం లేదాన్నాను..భారతదేశంలో సోదార-సోదరీమణులంతా ఖిలాఫత్‌- సహాయనిరాకరణ ఉద్యామం కోసం ఉద్యమించి, ప్రభుత్వం అనుసరిస్తున్నఅణిచివేత విధానాలను వ్యతిరేకించాలి.ఖిలాఫత్‌ ఉద్యా ప్రతి ఒక్కరి నుండి అత్యున్నత స్థాయి అర్పణను ఆశిస్తుంది. ఈ ధర్మ పోరాటంలో ప్రతి ముస్లిం ధనమాన ప్రాణాలు అర్పించేం దుకు సరfiదా సిద్ఢంగ ఉండాల్సిన సమయమిది. - బేగం జాఫర్‌ అలీ ఖాన్‌ 184