పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

సహాయనిరాకరణ ఉద్యమం సందర్భంగా ఉద్యామకారులంతా అరెస్టులవుతూ తాను తన భర్త ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌ అరెస్టు కానందుకు ఎంతో చింతిస్తూ వచ్చారు. చివరకు తన భర్త అరెస్టు కాగానే సంతోషం వ్యక్తం చేస్తూ ఆ విషయాన్ని టెలిగ్రాం ద్వారా గాంధీజీకి తెలిపారు. ఆ టెలిగ్రాం అందాుకున్న గాంధీజీ బేగం ఖుర్షీద్‌ ఉద్యమ స్పూర్తిని ప్రశంసిస్తూ ప్రతిష్టాత్మక మహానీయుని ధార్మపత్ని అను శీర్షికతో మరో వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ప్రభుత్వం నా భర్తను అరెస్టు చేసిందన్న విషయం తెలుసుకున్న మీకు ఆనందం కలిగి ఉంటుంది అని బేగం ఖుర్షీద్‌ ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నట్టు గాంధీజీ తెలిపారు.

ఈ అరెస్టు సమయంలో ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌ జాతీయ విశ్వవిద్యాలయం జామియా మిలియా ఇస్లామియా కులపతిగా బాధ్యాతలు నిర్వహిస్తున్నరు. ప్రభుత్వ కళశాలలు బహిష్కరించిన, ప్రభుత్వ సహాయం నిరాకరించిన విద్యాసంస్థలలోని విద్యారుల కోసం, జాతీయ భావాలను ప్రచారం చేయడనికి ఆచరణాత్మక విద్యాభోధన గావిస్తున్న జామియా మిలియాను ఆయన సమరవంతంగా నిర్వహిసున్నారు. ఆ సమయంలో ఆయన అరెస్టు జరిగింది. ఆయన అరెస్టుతో ఉద్యామ కార్యకలాపాలు ఆగిపోరాదాని బేగం ఖుర్షీద్‌ వాంఛించారు. ఆ విషయాన్ని కూడ గాంధీజీకి తెలియచేస్తూ, నా భర్త గైరాజరీలో జామియా మిలియా ఇస్లామియా (అలీఘర్‌) కార్యకలాపాల బాధ్యతలనన్నిటిని నేను నిర్వహించేందుకు కృషి చేస్తాను అని రాశారు. ఈ మేరకు ఆమె భర్త అరెస్టువలన జాతీయోద్యమ కార్యకలాపాలు కుంటుపడరాదని భావించి భర్త పక్షాన ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టి జాతీయ భావాలకు పుట్టినిల్లుగా నిలచిన జామియా మిలియా ఇస్లామియా విద్యా కేంద్రం కార్యకలాపాలను ఆమె పర్యవేక్షించారు.

జాతీయ భావాలను ప్రచారం గావించేందుకు, దేశభక్తి భావనలను ప్రోదిచేయడానికి అలీఘర్‌ కేంద్రంగా ఆమె హింద్‌ అను ఉర్దూ మాసపత్రికను 1921లో ప్రారంభించి, ఆ పత్రిక సంపాదాకత్వ బాధ్యతలను చేపట్టారు. ఆ పత్రిక ద్వారా దేశభక్తి భావనల ప్రచారం, బ్రిటిషు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్నిసమర్థ్ధవంతంగా నిర్వహిస్తూ బ్రిటిష్‌ ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు.

మహిళల్లో విద్య ఆవశ్యకతను గ్రహంచిన ఆమె, ఆ దిశగా చాలా శ్రద్దా చూపారు. మహిళలు చదువుకుంటే తప్ప సమాజంలో ప్రగతి సాధ్యం కాదని ఆమె నమ్మకం. 183