పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

ఆమె ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సభ్యులయ్యారు. ఆనాి నుండి 1981లో కన్నుమూసే వరకు ఆమె కాంగ్రెస్‌ సభ్యురాలుగా ఉన్నారు.

బేగం ఖుర్షీద్‌ అలీఘర్‌కు చెందిన న్యాయవాది ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌ను వివాహం చేసుకున్నారు. భర్త మజీద్‌ జాతీయోద్యామకారులు. వివాహానంతరం భర్తతో కలిసి ఆమె జాతీయోద్యమంలో ప్రత్యక్ష్యంగా ప్రవేశించారు. 1921 డిసెంబరు 24, 25 తేదిలలో హైదారాబాద్‌ నగరంలో జరిగిన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశాలలో ఆమె ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రతినిధిగా భారత జాతీయ కాంగ్రెస్‌ సబ్జెక్ట్‌ కమిటికి ప్రాతినిధ్యం వహించారు. ఆ సమావేశాలలో బేగం హసరత్‌ మోహాని, బేగం ముహమ్మద్‌ అలీ, కమలా నెహ్రూ,స్వరూపరాణి నెహ్రూలతో కలిసి ఆమె పని చేశారు.

జాతీయోద్యమంలో ప్రవేశించాక ఎదాురైన మానసిక, ఆర్థిక కష్టనష్టాలను చిరునవ్వుతో భరిస్తూ లక్ష్యంసాధనపట్ల దృఢచిత్తంతో ముందడుగు వేసిన బేగం ఖుర్షీద్‌ ప్రజల, ప్రజా నాయకుల ప్రశంసలు అందుకున్నారు. ఖిలాఫత-సహాయ నిరాకరణోద్యామ కార్యకలాపాలలో అవిశ్రాంతంగా పాల్గొంటూ పలువురికి ఆదర్ మయ్యారు. ఈ సందర్బంగా అరెస్టుకావటం, జైలుకెళ్ళటం ప్రతి ఉద్యమకారుని కర్తవ్యంగా ప్రకిటించారు. ఈ మేరకు గాంధీజీకి లేఖ రాస్తూ అందులో నా భర్త సహచరులంతా జైళ్ళకు వెళ్ళారు. నా భర్త మాత్రం ఇంత వరకు స్వేచ్ఛగా ఉండటం పట్ల మాకు బాధగా ఉంది అని పేర్కొన్నారు. ఆ భావనల నేపధ్యం బేగం ఖుర్షీద్‌ బాధమయ వాక్యాల మీద గాంధీజీ వ్యాఖ్యానం చేస్తూ, నిజమైన నిబద్ధతతో కూడిన భావనలు ఇలా ఉంటాయి. స్వాతంత్య్రం కోసం స్త్రీ, పురుషులంతా ఇలాగే జైళ్ళను నింపాటానికి సంతోషంగా ముందుకు వచ్చిన రోజున స్వరాజ్యం తప్పక లభిస్తుంది ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. (Collected Works of Mahathma Gandhi, Govt. Of India Publications, New Delhi)

ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌, బేగం ఖుర్షీద్‌ దాంపతుల త్యాగగుణ సంపన్నతను వివరిస్తూ, మహానీయురాలైన ప్రతిష్టాత్మక ధార్మపత్ని అను శీర్షికతో గాంధీజీ రాసిన వ్యాసంలో సుఖభోగాలను వదలి బేగం ఖుర్షీద్‌ కుటుంబం సాదాసీదా ఉద్యామకారుల జీవితాన్ని చేప్టటం, ఆ విధాంగా ఆ దంపతులు చేసిన త్యాగం, ఆమె భర్త ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌ గుణగణాలను ప్రస్తుతించారు. బేగం ఖుర్షీద్‌ కార్యనిర్వహణాదీక్ష, జాతీయోద్యమ లక్ష్యాల పట్ల ఉన్న నిబద్ధత గురించి గాంధీజీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 182