పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

జైలుకెళ్ళక పోవటం అపచారంగా భావించిన

బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా

(1896-1981)

జాతీయోద్యమంలో జైలుకు వెళ్ళటం బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించారు. జైలుకు ఎప్పుడెప్పుడు పోదామని ఎదురు చూశారు. ఏ కారణంగానైనా అరెస్టు కాకపోవటం, జైలుకు వెళ్ళ క పోవటం పెద్దా అపచారంగా పరిగణంచారు. జెలుకెళ్ళకపోవటం అపచారంగా భావించి జైలుకెళ్లాక ఆనందాన్ని వ్యక్తం చేసిన కుటుంబాలు ఆనాడు ఎన్నో ఉన్నాయి. అటువిం ఉద్యామస్పూర్తిగల కుటుంబ సభ్యురాలు బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా.

ప్రస్తుత ఆంధ్రాప్రదేశ్‌ రాజధాని హైదారాబాద్‌ నగరంలో బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా 1896లో జన్మించారు. ఆమె తండ్రి సర్‌ బులంద్‌ జంగ్‌. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆమె తాత సమీవుల్లా. ఆయన సర్‌ సయ్యద్‌ గా ప్రఖ్యాతి చెందిన సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌ సన్నిహిత మిత్రులలో ఒకరు.

స్వగృహంలో బేగం ఖుర్షీద్‌ సాంప్రదాయక విద్యను పూర్తి చేశారు. తండ్రితో పాటుగా హైదారాబాదులో నివాసం ఉన్నప్పుడు ఆమెకు సరోజిని నాయుడుతో పరిచయమయ్యింది. ఆ పరిచయం ద్వారా ఆమెస్వేఛ్చా,స్వాతంత్య్ర భావాలతో ప్రభావితులయ్యారు.ఆ క్రమంలో జాతీయోద్యా పట్ల ఆకర్షితులయ్యారు.1920లో 181