పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

చూపారు. అన్ని మతాలు భగవంతుడిని చేరు మార్గాలని ఆమె భావించారు. మతాలకు అతీతంగా మానవులంతా ఒక్కటేనని, ధార్మం మానవులలో ఐక్యత పెంచేందుకు దోహదపడలన్నారు. మహాత్ముని సేవాగ్రామంలో ఉన్న సమయంలో అక్కడ జరిగిన ప్రార్ధనా సమావేశాలలో అన్ని మతాలకు సంబంధించిన ప్రార్ధనా గీతాలను, చక్కని కంఠంతో గానం చేయటం ఆమె దినచర్యగా మారింది. ఆమె ఖురాన్‌ పఠనం అందరిని ఆకట్టుకుంది. ప్రతి సమావేశంలో ఆమె ఖురాన్‌ పఠనం ప్రత్యేకంగా సాగేది. మహాత్మా గాంధీ ఆమెచేత ఖురాన్‌ను చదివించుకుని శ్రద్ధగా వినేవారు. మత సామరస్యం బోధించే, సూఫీ సిద్థాంతాల పట్ల మక్కువ గల రహానా మతం పేరిట కలహాలు, మతస్థుల మధ్యా ఘర్షణలు జరిగితే విలవిల్లాడరు. మతఘర్షణల నివారణకు, శాంతి సామరస్యాల స్థాపనకు నిరంతరం కృషిసల్పారు. ఆమె సూఫి తత్వం.

మతసామరస్యం, హిందూ-ముస్లింల ఐక్యత వరకు పరిమితం కాలేదు. ఆమె తాత్వికత విస్వమానవ సోదరభావం దిశగా సాగింది. ఈ మేరకు ప్రచారకార్యక్రమాలను కూడ ఆమె నిర్వహించారు. ఆమె సలహాలను, సూచనలను స్వీకరించేందుకు, ప్రసంగాలను, ప్రార్థనా గీతాలను వినేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యక్రమాలకు హాజరయ్యేవారు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Yogdaan : Page. 250)

రెహానా తయ్యాబ్జీ చక్కని కవయిత్రి. ఆమె స్వయంగా పలు ప్రార్థనా గీతాలను రాశారు. అన్నిమతాలకు సంబంధించిన ప్రార్ధనా గీతాలను ఆమె స్వయంగా రాసి పాడి సభికులకు విన్పించి ప్రశంసలందుకున్న ఘట్టాలున్నాయి. ఆమె సేవాగ్రాం నుండి వెళ్ళిపోయాక కూడ గాంధీజీ ఆమెకు ఉత్తరాలు రాసి మరీ ప్రార్థనా గీతాలను, గజల్స్‌ను ప్రత్యేకంగా రాయించుకున్న సందార్భాలున్నాయి. నీ ప్రార్ధనా గీతాలు విననిదే నాకు బాగుండటం లేదు, నీవు వచ్చి పాడి విన్పించు అని గాంధీజీ ఆమెకు రాసిన ఉత్తరాలలో పేర్కొన్నారంటే ఆమె గీతాలు ఆయనను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలుస్తుంది. ఆమె కేవలం ప్రార్థ్ధనాగీతాలు మాత్రమే రాయలేదు. జాతీయోద్యామంలో భాగంగా ఉద్యమకారులను ఉత్తేజపర్చేందుకు ఉద్యమ గీతాలు కూడ రాశారు. ఆ పాటలను భారత జాతీయ కాంగ్రెస్‌ సభలు, సమావేశాల వేదికల మీదా నుండి పాడి విన్పించారు.

జాతీయోద్యామంలో భాగంగా ఆమె తల్లితండ్రులతో కలసి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. గుజరాత్‌లో మద్యపాన నిషేధ ఆందోళన, విదేశీవస్తువుల బహిష్కరణ ఉద్యమాల నిర్వహణకు గుజరాత్‌ మహిళల సమావేశాన్ని గాంధీజీ ఏర్పాటు చేసిన

179