పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


ఆధ్యర్యంలో సాగిన కార్యక్రమాలకు స్వయంగా నాయకత్వం వహించారు. తయ్యాబ్జీ కుటుంబంలోని ప్రతిఒక్కరూ చాలా వరకు ఏదోవిధాంగా జాతీయోద్యమంలో భాగస్వాములయ్యారు. ఆ కారణంగా తయ్యాబ్జీ కుటుంబం స్వాతంత్య్రోద్యామయోదుల కుటుంబంగా చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది.

ప్రఖ్యాతి చెందిన స్వాతంత్య్రసమరయోధుల కుటుంబంలో జన్మించిన రెహానా తయ్యాబ్జీ పెంపకం ఆ వాతావరణంలో సాగింది. ఆ ఇంట ప్రతి ఒక్కరూ ఉద్యామకారులు కావటం, ఆ ఇంటికి వచ్చే అతిథాులు కూడ ఆ బాటన నడుస్తున్న యెధాులు కావటంతో చిన్ననాటనే రహానా హృదాయంలో స్వేచ్ఛా, స్వతంత్ర భావాలు ప్రగాఢంగా నాటుకున్నాయి. ఆ వాతావరణం ఫలితంగా రెహానా తయ్యాబ్జీ కూడ బానిస బంధనాల నుండి విముక్తి కోసం సాగుతున్న పోరా దిశగా పయనించారు.

ఆధునిక విద్యతోపాటుగా సాంపద్రాయక విద్యను అభ్యసించిన రెహానా గ్రాడ్యుయేషన్‌ చేయటంతోపాటుగా ఆంగ్లం, హిందీ, గుజరాతీ, ఉర్దూ భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. తయ్యాబ్జీ కుంటుంబానికి మహాత్మాగాంధీ సన్నిహితులు కావటంతో చిన్ననాటనే రెహానాకు గాంధీజీ పరిచయం కలిగింది. ఆయనను తమ కుటుంబం లోని ఓ పెద్దగా తయ్యాబ్జీలు పరిగణించారు. ఆయనతో తమ కుటుంబ వ్యవహారాలను కూడ చర్చించి సలహాలు తీసుకున్నసందార్భలున్నాయి. గాంధీజీ ఆమెను తన కుమార్తెగా భావించారు. ఆమెకు సంబంధించిన ప్రతి విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపారు. గాంధీజీ తన ఉత్తరాలలో ఆమెను ప్రియపుత్రి, చిరంజీవి, రెహానా బేటిగా, బేటీ రహానా, ఉస్తాది సాహెబా, పాగల్‌ రహానా, భోలి బేటి అని సంబోధించారు.


మహాత్ముని సేవాగ్రాం ఆశ్రమంలో రెహానా తయ్యాబ్జీ కొంత కాలం గడిపారు. ఆ సందార్బంగా ఆమె గాంధీజీకి ఉర్దూ భాష నేర్పారు. ఆ తరు వాత కూడ ఆమె గాంధీజీకి తరచూ ఉతరాలు రాస్తూ ఆ విషయం మీదా ఎంతో శ్రద్ధచూపారు. ఆమె నుండి ఉత్తరాలు ఆందుకోవడం ఎంతో ఆనందదాయకమని గాంధీజీ చెప్పుకున్నారు. ఆమె నుండి ఉత్తరాలు రావటం అలశ్యమైతే ఆయన ఎంతో వ్యాకులత చెందారు. ఈ విషయాన్ని ఆమెకు రాసిన ఒక ఉత్తరంలో, నీ ఉత్తరం అందకుంటే నా మనస్సు గందరగోళంగా ఉంటుంది అని రాశారు. ఆ కారణంగా ఆమెను ఉస్తాది సాహెబా అని తన ఉత్తరాలలో సంబోధించారు. రెహానా తయ్యాబ్జీ సూఫితత్వాభిలాషి. ఆమె అన్ని మతాల పట్ల సమాన గౌరవం

178