పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీజీకి ఉర్దూ భాష నేర్పిన మంచి కవయిత్రి

బేగం రెహానా తయ్యాబ్జీ

(1900-1975)

జాతీయోద్యమంలో తాత, తలితండ్రులతోపాటుగా మాత్రవుే కాకుండ మెట్టినింట చేరాక కూడ భర్త కుటుంబీకులతో కలసి పోరుబాట నడిచిన అవకాశం ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులలో చాలా కొద్ది మందికి లభించింది. అటువంటి అదృష్టానికి నోచుకున్న అతికొద్ది మందిలో ఒకరు రెహానా తయ్యాబ్జీ.

గుజరాత్‌ లోని సంపన్నతయ్యాబ్జీ కుటుంబంలో రెహానా తయ్యాబ్జీ 1900 జనవరి 27న జన్మించారు. ఆమె తల్లి ఆమీనా తయ్యాబ్జీ (1866-1942), తండ్రి జస్టిస్‌ అబ్బాస్‌ తయ్యాబ్జీ (1854-1936). ఆయన గాంధీజీ చే గుజరాతి వజ్రం గా పిలువబడిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు. 1885లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ స్థాపన జరిగినప్పటి నుండి తయ్యాబ్జీ కుటుంబీకులు అందులో సభ్యులు. ఆమె సన్నిహిత సంబంధీకులు జస్టిస్‌ బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ (1844-1906) ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా పనిచేయగా తయ్యాబ్టీ కుంటుంబంలోని పలువురు మహిళలుజాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.

రెహానా తండ్రి జస్టిస్‌ అబ్బాస్‌ తయ్యాబ్జీ, తల్లి అమీనా తయ్యాబ్జీలు మహాత్ముని నేతృత్వంతో సాగిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆమె తల్లి గుజరాత్‌లో మహిళల

177