పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

చివరకు కట్టుబట్టలతో ఢిల్లీ వెళ్ళి ముస్లిం శరణార్థ్దుల శిబిరంలో గడపాల్సిన దుస్థితి రావటంతో ఆమె తీవ్రంగా కుంగిపోయారు. ఆత్మీయులు, సన్నిహితులు పాకిస్తాన్‌ వెళ్ళ మని సలహా ఇచ్చినా, ఆ సలహాలను ఖాతరు చేయలేదు. ఆ భయానక వాతావరణంలో కూడ భారత దేశ సరిహద్దులు దాటడనికి ఆమె ఇష్టపడలేదు.

స్వాతంత్య్రం లభించాక డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ ప్రభుత్వంలో ఎటువింటి పదవిని ఆధికారాన్ని ఆశించలేదు. ప్రపంచ శాంతి-,స్వేహాలు కాంకక్షింస్తూ వామపక్ష భావాల వైపు మొగ్గు చూపుతూ ప్రపంచ శాంతి ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన మారిన రాజకీయ అభిప్రాయాల మూలంగా ఆ సాదాత్‌ బానో దంపతులు అధికారం వెలగబడు తున్న నేతల అలక్ష్యానికి గురయ్యారు. ప్రముఖులతో స్వేహసంబంధాలున్నా డాక్టర్‌ కిచ్లూ దాంపతులు ఎటువంటి పదవిని గాని, ఎట్టి లబ్దిని కాని ఆశించలేదు. ఆర్థికంగా అవస్థలు పడుతూ చివరకు సన్నిహితులు, తమ మీద ఆధారపడిన ఇతరుల పోషణ కోసం ఉన్న ఆస్తిపాస్తులను అమ్మివేయడంతో ఆర్థికంగా బాగా చితికిపోయారు. అనారోగ్యం, పేదారికం వెాండుతున్నా ఆర్థిక సహాయం అర్థించడనికి ఆమె ఇష్టపడలేదు. భర్త డాక్టర్‌ కిచ్లూ అనారోగ్యంతో బాధపడు తుండగా పండిత నెహ్రూ కల్పించుకుని చికిత్స నిమిత్తం ఆయనను బలవంతంగా ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ఆక్రమంలో సాదాత్‌ బానో అధికార రాజకీయాలకు దూరమై ప్రజాసంఘాలలో పనిచేయసాగారు.1963 లో డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ మృతి చెందాక ఆమె ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారాయి. ఆ దుస్థితిలో కూడ ఆమె ఎవ్వరి వద్ద చేయి చాచలేదు. ప్రభుత్వాన్ని యాచించలేదు. ప్రభుత్వం కూడ ఆ యోధురాలిని ఆదుకోలేదు. చివరకు కటిక పేదరికంలో మగ్గుతూ, సరైన చికిత్సకు కూడ నోచుకోక, కనీసం మందులు కూడ కరువై అనారోగ్యంతో సమరం సాగిస్తూ శ్రీమతి సాదాత్‌ బానో కిచ్లూ 1970 ఆగస్టు 18న కన్నుమూశారు.

♦♦♦♦

మాతృభూమి,స్వేచ్ఛాస్వాతంత్య్రాల నిమిత్తం పోరాడుతున్న నా భర్త జీవితం తొలుత ఈ జాతి సొత్తు, ఆ తరువాత మాత్రమే నాది, మరెవరిదైనా. అందువలన నా భర్తజీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది జాతిజనులు నిర్ణయించాలి. - బేగం ముహమ్మద్‌ ఆలం

174