పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆ దంపతు లు ఖద్దరు ధరించటం ప్రారంభించారు. సాదాత్‌ బానో జీవితాంతం ఖద్దరు ధరించటమే కాకుండ, ఆమె బిడ్డలు కూడ ఖద్దరు ధారణకు ఇష్టపడేట్టుగా ఆమె తయారు చేశారు. ఖద్దరు ప్రచారంలో ఆమె క్రియాశీలక పాత్ర వహించారు. 1930 నుండి 1934 వరకు సాగిన శాసనోల్లంఘన ఉద్యమంలో భర్తతోపాటుగా ఆమె ఆన్ని సమావేశాలకు హజరయ్యారు. ముస్లిం సాంప్రదాయాలను గౌరవిస్తూ కూతురు జుబెదాతో కలసి ఆయా కార్యక్రమాలలో చురుకైన పాత్ర వహించారు. (Saifuddin Kitchlew : Page. 139)

భర్తతోపాటుగా జాతీయ-అంతర్జాతీయ వ్యవహారాల పట్ల, రాజకీయ వ్యవస్థలు, రాజకీయ ఆలోచనల పట్ల చక్కని అవగాహనగల సాదాత్‌ బానో ప్రజలకు, ప్రధానంగా యువతకు ఆకర్షణ కేంద్రయ్యారు. ఈ అవకాశాన్ని ఆమె ఉపయాగించుకుని యువతీ, యువకులలో దేశభక్తి భావనలను పెంపొందించేందాుకు కృషి సల్పారు. యువతకు సన్మారం చూపటం మాత్రమే కాకుండ వారిని అవసరాలలో ఆదుకున్నారు. ఆ విధగా యువత అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆమెను యువతీ యువకులు ప్రేమతో ఆపాజీ (అక్కయ్య) అని పిలుచుకున్నారు.

జాతీయోద్యమంలో భాగంగా సాగిన మహిళా చైతన్య కార్యక్రమాలలో కూడ ఆమె అపరిమిత ఆసక్తి చూపారు. అఖిల భారత మహిళా సంఘాలలో ఆమె చురుకైన పాత్ర నిర్వహించారు. స్వాతంత్య్రోద్యామ కాలంలో, విభజన తరువాత స్వతంత్ర భారత దేశంలో మహిళల పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఆమె పాటుపడ్డారు.

డకర్‌ కిచ్లూ దంపతులు తొలుత నుండి ముసింలీగ్‌ వేర్పాటు వాదా రాజకీయాలను వ్యతిరేకించారు. హిందూ-ముస్లింల ఐక్యతను ప్రగాఢంగా కాంక్షించిన ఆ భార్యాభర్తలు లీగ్‌ కార్యకర్తల ఆగ్రహానికి గురైనప్పికీ తమ మార్గం మార్చుకోలేదు. భారత్‌ విభజనను చివరి క్షణం వరకు వ్యతిరేకించారు. అయినా విభజన జరగటంతో, మతోన్మాదానికి జాతీయవాదాం దాసోహం అన్నది అని డాక్టర్‌ కిచ్లూ చేసన విమర్శను ఆమె సమర్థించారు. మాతృదేశం రెండుగా చీలిపోవడన్ని ఆమె సహించలేక పోయారు. ఆ మానసిక పరిస్థితులలో విభజన వలన వచ్చిపడిన ఉపద్రవాన్ని ఆ కుటుంబం చవిచూడల్సివచ్చింది. నిరంతరం దేశ స్వేచ్చ, స్వాతంత్య్రాల కోసం పోరాడిన ఆ కుటుంబానికి కూడ భయంకర పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ దంపతుల ఆస్థిపాస్తులన్నీ దుండగులు దోచుకున్నారు. 173