పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

జరిపి ఆయనకు శిక్ష విధించారు. ఆ సంకట సమయంలో సాదాత్‌ బానో మ్లాడుతూ నా భర్తకు శిక్ష పడినందాుకు సంతోషంగా ఉంది. ఆందుకు ఆ ప్రభువుకు నా సాష్టాంగ ప్రణామములు. ఆయన మార్గంలోనే నేనూ నడుస్తా. ఆ కంటక ప్రాయమైన మార్గంలో సాగి నా ప్రాణాలను బలివ్వడానికి కూడ నేను సర్వదా సిద్ధం అని ధైర్యశాలిగా ప్రకటించారు.

పంజాబు అకృత్యాల మీద విచారణ కోసం మహాత్మాగాంధీ పంజాబు వచ్చి సాదాత్‌ బానో కిచ్లూను కలిశారు. ఆ సందర్భంగా ఉద్యామకారుల విడుదల కోరుతూ, గాంధీజీని ఉద్దేశించి ఈ క్రింది కవితను రాసి ఆయన గౌరవార్థం సమర్పించారు.

ప్రతి హృదయంలో నీ నివాసం ఉంది కదా గాంధీ. నీ ప్రశంసలకు ఆలవాలం కదా ప్రతి జిహ్వా గాంధీ! నీ గురించి గౌరవం అను పుష్పాలు ఆన్ని చోట్ల పూశాయి. ఈ పూదోటలో శిశిరం ఏనాటికీ రాబోదు. అమృతసర్‌ వాసులు తీవ్రదుఃఖంలో చిక్కుకున్నారు. వారికి వారి లక్ష్యం తప్పక లభిస్తుంది. యదార్థాన్ని మీరు విడమర్చి చెప్పాలి మరీ. మీ మార్గదర్శ కత్వంలో సూచించాలి ఉపాయాల్ని. జెల్లో పడివున్నవాళ్ళు బంధవిముకులవ్వాలి.

ఈ అరెసుల సందార్బంగా ప్రముఖ జాతీయోద్యామ నాయకులు పండిత జవహర్‌ లాల్‌ నెప్ర˙, సి.ఆర్‌.దాస్‌, స్వామి శ్రద్ధానందా తదితరులు పరామర్శించేందుకు ఆమె ఇంటికి వచ్చారు. ఆ సందర్భంగా, మాతృభూమి దాస్య విముక్తి కోసం సాగుతున్న పోరులో నా భర్త జైలు కెళ్ళటం మాకందరికి గర్వకారణం తప్ప చింతించాల్సినదేమీ లేదాని, ప్రకిటించి ఆ నేతలను ఆశ్చర్యపర్చారు.

బ్రిటిషు పోలీసుల ఎత్తులను ఎదాుర్కొనేందుకు జాతీయోద్యమకారులకు శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో డక్టర్‌ కిచ్లూ స్వరాజ్య ఆశ్రమం స్థాపించారు. ఆ ఆశ్రమాన్ని 1921లో మహాత్ముడు ప్రారంభోత్సవం చేయగా, అందులో సర్దార్‌ భగత్‌సింగ్‌ లాంటి యోధులు శిక్షణ పొందారు. ఆ ఆశ్రమం వ్యవస్థాపక అధ్యకులుగా డాక్టర్‌ కిచ్లూ శికణా కార్యక్రమాలను నిర్వహించారు. బ్రిీష్‌ ప్రభుత్వం అలవాటుగా డాక్టర్‌ కిచ్లూను అరెస్టు చేయగా ఆయన స్థానంలో సాదాత్‌ బానో కిచ్లూ స్వరాజ్య ఆశ్రమ నిర్వహణ బాధ్యాతలను స్వీకరించారు. ప్రభుత్వ గూఢచారుల నిఘా కళ్ళనుండి తప్పించుకుంటూ, ఆటంకాలు అధిగమిస్తూ ఆమె స్వరాజ్య ఆశ్రమం బరువు బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు. (Saifuddin Kitchlew - Hero of Jallianwala Bagh, Toufique Kitchlew, NBT, India, 1996, Page. 42) 172