పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిషు గూఢచారులు విరుచుకుపడతారో, ఎవరిని ఎక్కడికి తీసకువెళాతారో తెలియని భయానక రోజులవి.

ఆ రోజుల్లో కూడ, మీరు ధైర్యం కోల్పోకండి. వేదనపాలు కావొద్దు- అస్తిత్వపు తోటలోన పూలలా వికసంచండి - ఈ సాదాత్‌ ప్రార్థనను ఎప్పుడూ మరవొద్దు- ఏలాగైనా మీరు స్వపరిపాలనా స్వేచ్ఛను పొందండి, అంటూ ఉద్యామకారులను ప్రోత్సహిస్తూ కవితలు రాశారు.

ఈ విధాంగా కవితలు రాయటం, రచనలు చేయటం మాత్రమే కాకుండ ఆమె మంచి వక్తగా ప్రధానంగా మహిళలను ఉత్తేజపర్చుతూ ప్రసంగాలు కూడ చేశారు. ఆ ప్రసంగాలు మహిళలను బాగా ఉతేజితుల్ని చేశాయి. ఆ ప్రసంగాలలోని బ్రిటిషు వ్యతిరేక భావనలు సహజంగానే ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యాయి.1919లో చారిత్రాత్మక జలియన్‌వాలా బాగ్‌ సభలో ఆమెకూడ ప్రసంగం చేయాల్సి ఉంది. ఆమె ఉత్తేజపూరిత ప్రసంగం కూడ తయారు చేసుకున్నారు. ఆ రోజున అమృతసరలో ఉన్న అంవాంఛనీయ వాతావరణం మూలంగా సన్నిహితులు, జాతీయ కాంగ్రెస్‌ నాయకుల వత్తిడి మేరకు జలియన్‌వాలా బాగ్‌ సభాప్రాంగణానికి ఆమె చేరలేకపోయారు.

రౌలత్‌ చటం కిరాతకత్వానికి పంజాబు ప్రజలతోపాటుగా డాక్టర్‌ సైపుద్దీన్‌ కిచ్లూ బలయ్యారు. ఆయనకు సంకళ్ళువేసి అజ్ఞాత స్థానానికి తరలించారు. ఆయన ప్రాణాలకు ముప్పువాటిల్లనుందని ప్రజలలో తీవ్ర ఆందోళన ప్రారంభమైంది. ఆ తరువాత విచారణ 171