పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

స్వార్థపూరిత సామాజిక వాతావరణంలో పతన మవుతున్నమానవీయ విలువల మధ్య బ్రతుకుతున్న ప్రస్తుత యువత ఈ పుస్తకం ద్వారా ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూస్తే ఎటువింటి త్యాగాలతో ప్రస్తుత సమాజాంన్నినిర్మించుకున్నామో వారికి అర్దమవుతుంది. గతాన్ని తెలుసుకొని ఆ పునాదాుల మీదాుగా లౌకిక, ప్రజాస్వామిక,మానవీయ విలువలతో కూడిన ఉన్నతమైన సమాజాన్ని నిర్మించుకొనానికి కావలసిన ప్రాతిపదిక ఈ పుస్తకంలో ఉన్నది.

విశ్వవిద్యాలయాలలో సామాజిక శాస్రంలో ప్ర త్యేకించి చరిత్రకు సంబంధించిన పరిశోధన అధ్యయనాలకు సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌ వ్రాసిన ఈపుస్తకం ఒక నమూనాను అందిస్తుందని నిస్సందేహంగా చెప్ప వచ్చు. పరిశోధకు లకిది స్పూర్తినిస్తుంది. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ముస్లింమహిళలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించటం సుళువైన విషయం కాదు. నిరంతర అంవేషణ, నిజాయితితో కూడిన అవిశ్రాంత కృషి, పట్టుదల అవసరమవుతాయి. అధ్యయనం పట్ల ఆసక్తి, సీరియస్‌నెస్‌ వున్న రచయిత నశీర్‌ అహమ్మద్‌ ఎన్నో గ్రంథాలయాలు తిరిగి, ఎమన్నో సంస్థలను, వ్యక్తులను కలసి వివిధ భాషల్లో వున్న ఆధారాలను సేకరించటం వల్లే ఈ పుస్తకరచన సాధ్యమైందని భావించవచ్చు. వ్యక్తుల జీవిత చరిత్రలకు ఫొటోలు కూడ జతపర్చినప్పుడు అధ్యయనం చేసేవారు ఆత్మీయ భావనకు లోనవుతారు.ఇందుకోసం మహిళల ఫోటోలను సేకరించడానికి రచయిత చేసిన శ్రమ అభిలషణయం.

సామాజిక స్పహతో తపనతో ఎంతో శ్రమించి, ఎన్నో ఆధారాలను అధ్య యనం చేసి, అదృశ్యంగా ఉన్న ముస్లిం మహిళలు, ముస్లిం యోధులు స్వాతంత్య్ర పోరాటంలో నిర్వహించిన పాత్రను తన పలు గ్రంథాలద్వారా, అసంఖ్యాకమైన తన వ్యాసాల ద్వారా వెలుగులోకి తీసుకరావటంలో రచయిత అనిర్వచనీయమైన కృషి వ్యక్తం అవుతుంది. భారతదేశ చరిత్రలో ముస్లింల భాగస్వామ్యం దిశగా శ్రీ సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ నిరంతరం సాగిసున్న కృషి ఆహ్వానించదగింది మాత్రమే కాదు అభినందించదగింది. ఈ పుసకానికి 'స్నేహ వాక్యం' వ్రాసే అవకాశం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను.

14