పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


నిర్ణయించారు. 1933 ఆగస్టు 1న ఆశ్రమవాసులతో పరిసర గ్రామాలలో ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. ఆ ప్రదర్శన జరిగితే అరెస్టులు, జైలు శిక్షలు తథ్యాం కనుక ఆ సమయంలో జెలులో ఉన్న భర్త గులాం రసూల్‌తో ఆమనా మ్లాడి అనుమతి పొందారు. ఆ ప్రదార్శన జరగక ముందే ఆశ్రమవాసులందర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆమనా ఆశ్రమంలో లేరు. ఆమె బాపూజీ ఆదేశం మేరకు తన ముగ్గురు పిల్లలను హరిజన ఆశ్రమంలోని అనుసూయా బెన్‌ వద్దా చేర్చడనికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ కారణంగా ఆమె అరెస్టు కాలేదు. ఆశ్రమ సహచరులంతా అరెస్టయ్యి తాను అరెస్టు కాలేకపోయినందాుకు ఆమనా బాధపడ్డారు.

సబర్మతి ఆశ్రమం నుండి వార్దా ఆశ్రమానికి రావాల్సిందిగా జమునాలాల్‌ బజాజ్‌ కోరిన మీదాట గాంధీజీ ఆందాుకు అంగీకరించారు. ఆ సమయంలో సబర్మతి ఆశ్రమం ను ఆయన హరిజన సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు వక్ఫ్ చేశారు. ఆశ్రమ సహచరులకు ఆ కార్యక్రమాల నిర్వహణ అప్పజెప్పారు. ఆ సమయంలో ఆశ్రమంలోని కార్యనిర్వహణ బాధ్యతలను ఆమనా ఖురేషి, ఆశ్రమ బయటి కార్యక్రమాలను గులాం రసూల్‌ ఖురేషి నిర్వహించాలని గాంధీజీ ఆ దాంపతులను ఆదేశించారు. మహాత్ముడి ఆదేశాల అనుసారంగా సబర్మతి ఆశ్రమంలో తన ముగ్గురు పిల్లలతో కలసి ఉండటం కాకుండ ఆశ్రమ వాసులందరికి తలల్లిగా అందరి ఆవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో గాంధీజీ అప్పగించిన బాధ్యాతలను ఆమనా ఖురేషి చివరి వరకు నిర్వహించారు.

ఈ మేరకుస్వాతంత్య్రోద్యమంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్న గులాం రసూల్‌ ఖురేషి పలుమార్లు జైలుకెళ్లినా, స్వయంగా పోలీసుల దాష్టీకానికి గురైనప్పటికీ, గాంధీజీ పర్యవేక్షణలో సంతరించుకున్న ధైర్యసాహసాలు, లక్ష్యసాధన పట్ల పట్టుదల, నిబద్దాతల ఫలితంగా అన్ని కడగండ్లను ఆమె చిరునవవ్వుతో భరించారు. అసాధారణ వ్యక్తిత్వం, దృఢ సంకల్పం, కార్యదక్షత, ధైర్య సాహసాల ప్రతిరూపంగా చివరివరకు నిలచిన శ్రీమతి ఆమనా ఖురేషి 1967లో కన్నుమూశారు.

164