పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు


ఆమనా పలుమార్లు గాంధీజీని బ్రతిమాడల్సి వచ్చింది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు, ఆ తరువాత బాలింతగా ఉన్నప్పుడు కూడ బ్రిటిషు వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొని జైలుకు వెళ్ళడనికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆమె గాంధీజీని పలుమార్లు కోరుతూ వచ్చారు.

1930లో సాగిన దండియాత్ర సందర్భంగా ఆశ్రమవాసులు కూడ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని గాంధీజీ ఆకాంక్షించారు. ఆ యాత్రలో పాల్గొన్న ఆమనా తండ్రి ఇమాం సాహెబ్‌ను పోలీసులు నిర్బధంలోకి తీసుకున్నారు. ఆయన నిర్బంధంలో ఉండగానే ఆనారోగ్యంతో బాధాపడుతూ 1931 డిసెంబరు ఒకటిన కన్నుమూశారు. అంతకు మునుపు ఆమనా తల్లి కూడ కన్నుమూయటంతో ఆమనా, ఫాతిమాలు తల్లితండ్రులను కొల్పోయిన వారయ్యారు. ఆ సమయంలో భర్త గులాం రసూల్‌ కూడ జైలు పాలయ్యారు. అప్పుడు కూడ బిడ్డతో సహా జైలుకు వెళ్ళేందుకు అనుమతివ్వమని ఆమనా ఖురేషి గాంధీజీని అర్థించారు.

చివరకు గుజరాత్‌లో విదేశీవస్తు బహిష్కరణ, మధ్యా పాన నిషేదం కోరుతూ పికిటింగ్‌ నిర్వహణకు మహాత్మాగాంధీ గుజరాత్‌ మహిళలకు అనుమతి ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయా కార్యక్రమాలలో ఆమనా ఖురేషి ఉత్సాహంగా పాల్గొనే అవకాశం లభించింది. గుజరాత్‌కు చెందిన తయ్యాబ్జీ కుటుంబానికి చెందిన రెహనా తయ్యాబ్‌ అలీ, హమీదా తయ్యాబ్జీలతో కలసి ఆమనా ఆ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె ఎన్నాళ్ళనుంచో ఎదాురు చూస్తున్న అవకాశం లభించింది. ఆమనాను పోలీసులు అరెస్టు చేయగా న్యాయస్థానం మూడు మాసాల జైలుశిక్ష విధించింది.

ఒకవైపు భర్త అరెస్టు మరోవైపున చిన్న చిన్న బిడ్డలతో ఉంటూ కూడా ఆమనా ఖురేషి మంచి సత్యగ్రహిగా పలువురికి ఆదర్శవంతంగా నిలిచారు. ఈ విషయం తెలుసుకున్న గాంధీజీ ఆమెకు ఉత్తరం రాస్తూ, చిరంజీవి ఆమనా, నీవు చాలా ధైర్యం- సాహసం చూపావని చాలా మంది చెప్పారు, రాశారు. ఫోనిక్స్‌ మరియు సబర్మతీ ఆశ్రమంలో పెంపకం, శిక్షణ పొందిన ఇమాం సాహెబ్‌ గారి అమ్మాయి అలా కాకుండ మరెలా ప్రవర్తిస్తుంది అంటూ ఆమె ప్రవర్తన పట్ల ఆయన గర్వం వ్యక్తంచేశారు. స్వాతంత్య్రసంగ్రామాన్ని అణిచివేయదాలచిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఉద్యామకారుల ఆస్తులను జప్తు చేయ దలచింది. ఆ సయయంలో గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని మూసివేయ

163