పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు


లేననుకుంటున్నాను. మరో వ్యాపారం ఆరంభించ లేను. ఒక సత్యాగ్రహి అన్ని రకాల విశ్రాంతులు, ఐశ్వర్యం, ధనసంపదల మీదా కోరికలను త్యాగం చేయాలి. ' అని ఇమాం సాహెబ్‌ అన్నారు. ఈ సమాధానంతో నాకెంతో సంతోషం కలిగింది. నా ఫోనిక్స్‌ సహచరులకు కూడ ఈ విషయం గురించి రాశా. మా ప్రయోగాన్ని, మా నిశ్చయాన్ని వాళ్ళంతా స్వాగతించారు. ఈ విధంగా ఇమాం సాహెబ్‌ ఆయన పరివారం మా వెంట వచ్చేశారు.

ఫోనిక్స్‌లో ఇమాం సాహెబ్‌ మిగతా సహచరులతో సమానంగా భాగస్వామ్యం వహించారు. ఫోనిక్స్‌లో మా గృహాలు కొండ మీద ఉండేవి. ప్రతి వ్యక్తి తన వాడకం కోసం నీళ్ళను స్వయంగా కొండ దిగి వెళ్ళి కింద నుండి పైకి తెచ్చుకోవాలి. ఆ సమయంలో ఇమాం సాహెబ్‌ ఆరోగ్యం బాగాలేకున్నా ప్రతిరోజు ఉదయం పూట బక్కెట్లలో నీళ్ళుపట్టి 50 అడుగుల ఎత్తుకు మోసుకొచ్చేవారు....ఆశ్రమ నివాసులంతా యువకులుగాని యువతులు గాని, నవయువకులుగాని, వృద్ధులుగాని ఏదో ఒక పని చేయాలన్నది అనివార్యం.

ఇమాం సాహెబ్‌, హజీ సాహెబా, ఫాతిమా, ఆమనా ముద్రాణాలయంలో పని చేసేవారు. ఇమాం సాహెబ్‌ కంపోజింగ్ పని నేర్చుకున్నారు. ఆయన లాంటి స్వభావంగల వృధులు కంపోజింగ్ నేర్చుకోవడం ఆశ్చర్యకరం. ఆయన కుటుంబం మాంసాహారి. అయితే ఫోనిక్స్‌లో వారు మాంసాన్ని వండినట్టు నాకు గుర్తులేదు. అంతమాత్రాన ధార్మిక విషయాలలో ఆయనకు పట్టింపు లేదని కాదు. ఆయన నమాజ్‌ చేయకుండా ఎప్పుడూ ఉండలేదు. ఆయన పరివారం కూడ ఉపవాసం పాటించకుండా ఎప్పుడూ ఉండలేదు. ఆశ్రమవాసుల జీవనశైలిని పాటిస్తూ కూడ, ఇస్లాం ధార్మిక ఆలోచనలలోని విశాలత్వాన్ని వారు దర్శనీయం గావించారు.

ఇమాం సాహెబ్‌ వ్యకిత్వం, బలిదానం మరికొన్ని పరీక్షలకు గురికావాల్సి ఉండింది. 1914లో అసలు పరీక్ష వారి ఎదుట నిలిచింది. ఆశ్రమంలోని అత్యధికులు ఆశ్రమం వదలి భారతదేశానికి తిరిగి వెళ్ళడానికి నిర్ణయించారు. ఇమాం సాహెబాకు దక్షిణాఫ్రికా స్వంత దేశమైపోయింది. హాజీ సాహెబా, ఫాతిమా, ఆమనాలకు భారతదేశం ఏమీ తెలియని అపరిచిత దేశం. వారికి ఏ భారతీయ భాషలో కూడ ప్రవేశం లేదు. ఆంగ్లం, డచ్‌ భాషలు తప్ప మరొక భాష వారికి తెలియని పరిస్థితి. అయినా కుటుంబ సమేతంగా


161