పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాతీయోద్యమానికి సర్వం సమర్పించిన వితరణశీలి

ఆమనా ఖురేషి

(1905- 1967)

పరాయి పాలకుల నుండి దేశాన్ని విముక్తి చేయాలన్నబలమైన కాంక్ష ఆనాడు భారతీయుల మనోభావాలను బలంగా ప్రభావితం చేసింది. ఆ భావన స్వేచ్ఛ- స్వాతంత్య్రాలను సాధించేందుకు తమ ప్రాణాలను సైతం అర్పించడానికి వెనుకాడని యువతను ఒకవైపు , మహాత్ముని ఆహింసాపదాన కషనష్టాలకు భయ పడకుండా ముందుకు సాగిన ప్రజలను మరోవెపు ఉద్యమ దిశగా ఉపక్రమింప చేసంది. భారతదశం మొత్తాన్ని ఆవరించిన ఆ అద్బుత వాతావరణం విదేశాలలో ఉంటున్న భారతీయులనూ బలంగా తాకింది. మాతృభూమి పట్ల ఏర్పడిన ఆ మనోభావాలు విదేశాలలో ఉన్నవాళ్ళను కూడ అక్కడ నుండి బ్రిటిషు ప్రబుత్వం మీద పోరాటానికి పురికొల్పగా, విదేశాలలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నవాళ్ళను స్వదేశానికి రప్పించాయి. ఈ విధంగా విముక్తి పోరాటంలో భాగస్వాములయ్యేందుకు స్వదేశం తిరిగివచ్చిన కుటుంబంలోని సభ్యురాలు ఆమనా ఖురేషి.

జాతీయోద్యామానికి సంపూర్ణ జీవితాలను, ధనసంపదలను పూర్తిగా సమర్పిం చుకున్నకుటుంబానికి చెందిన చిన్నారి ఆమనా ఖురేషి. ఆమె తండ్రి ఇమామ్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ దక్షిణాఫ్రికాలో అరేబియా గుర్రాల వ్యాపారి. ఆయన చిన్న కుమార్తె ఆమనా. 159