పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


అడ్డుకోవాలని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతి భద్రతలకు భంగం కల్గించారన్న నేరారోపణ చేసి ఏకపక్ష విచారణ జరిపారు.

ఆమెకు నాలుగు మాసాల కఠిన కారాగార శిక్ష, వందరూపాయల జరిమానా విధించారు. ఈ వార్త గుజరాత్‌ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రజలు ఆగ్రహావేశా లను వ్యకంచేశారు. బ్రిటిష్‌ న్యాయవ్యవస్థను, ప్రభుత్వాన్ని దుయ్యపడు తూ, సకీనా బేగంకు విధించిన శిక్షను రద్దు చేయాల్సిందిగా ప్రజలు ఉద్యమించారు. జాతీయో ద్యమ నాయకులంతా ఆమె శిక్షను రద్దు చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఆమెస్వయంగా అభ్యర్థిస్తే శిక్ష తగ్గించగల అవకాశాలున్నా, ఆ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేందుకు సకీనా బేగం నిరాకరించారు.

ఆ సందర్భంగా అమ్మను నిరోధిస్తే ఆమె ఆరంభించిన కార్యక్రమాలను కొనసాగించడానికి మేమున్నాం. మమ్మల్నికూడ అరెస్టు చేయండి. మాకూ శిక్షలు విధించండి, అంటూ భారీ సంఖ్యలో గుజరాత్‌ యువత ముందుకు వచ్చింది. మహిళలు ప్రబుత్వ చర్యల మీద నిరసన వ్యకంచేస్తూ విరుచుకుపడ్డారు . చివరకు ప్రబుత్వం దిగిరాక తప్పలేదు. ఆమెకు విధించిన కఠిన జైలు శిక్షను కాస్తా సామాన్య జైలుశిక్షగా మార్చక తప్పలేదు.

ఈ మేరకు ' తయ్యాబ్జీ పరివారం సభ్యులు అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించారు..' అంటూ గాంధీజీ నుండి ప్రశంసలందుకున్న సకీనా బేగం, జాతీయోద్యమ సంఘ టనలన్నింటిలో ప్రముఖ పాత్ర వహించారు. మధ్య పాన నిషేధ ఉద్యమంలో భాగంగా వై శ్రాయికి గుజరాత్‌ రాష్ట్ర మహిళలు రాసిన చారిత్రాత్మక లేఖ మీద అమీనా తయ్యాబ్జీతో పాటుగా సకీనా లుక్మాని కూడ మహాత్ముని విజ్ఞప్తి మేరకు సంతకం చేశారు. గాంధీజీని బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్టుచేయగా గుజరాత్‌లో మహిళలతో భారీ సమావేశాన్ని ఆమె ఏర్పాటుచేసి ప్రభుత్వవైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ తీర్మానం చేయించారు.

అపూర్వత్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించాక, దేశం రండుగా చీలిపోవటం పట్ల ఆమె ఎంతో వ్యాకులత చెందారు. ఆ తరువాత ఆమె తన సమయాన్ని సామాజిక సేవకు అంకితం చేశారు. 1960 ఫిబ్రవరి 6న కన్నుమూసేంత వరకూ ప్రజాసేవలో గడిపిన శ్రీమతి సకీనా లుక్మాని త్యాగం చిరస్మరణీయం.

158