పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అసాధారణ దేశభక్తికి అపూర్వ చిహ్నం

సకీనా లుక్మాని

(1865-1960)

స్వాతంత్య్రోద్యమంలో ఆది నుండి ప్రధాన పాత్ర వహించిన తయ్యాబ్జీ కుటుంబం పలువురు మహిళలను జాతీ యోద్యమానికి అంకితం చేసింది. ఈ మహిళల్లో రెండుపదాులు దాటని మహిళల నుండి యనభై ఏండ్ల పెద్దామె వరకు ఉన్నారు. అ విధాంగాపెద్ద వయస్సులోకూడ జాతీయోద్యామంలో పాల్గొన్న మహిళలలో బేగం సక్సేనా లుక్మాని ఒకరు.

బేగం సకీనా లుక్మాని 1865 ప్రాంతంలో జన్మించారు. ఆమె స్వాతంత్రోద్యమ నేత బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ కుమార్తె. తండ్రి జాతీయ భావాలను చిన్ననాటే అందిపుచ్చుకున్నఆమె గాంధీ పిలుపు మేరకు 1930లో గుజరాత్‌లో సాగిన విదేశీ వస్తు బహిష్కరణ,మద్యపాన నిషేధ ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర వహించారు. అప్పుడు ఆమె వయస్సు65 సంవత్సరాలు. ఈ ఉద్యమంలో భాగంగా పెద్ద వయస్సులో కూడ విదేశీ వస్తువులవిక్రయశాలల, మద్యాపాన విక్రయకేంద్రాల ఎదుట పికిెంగ్‌ జరుపుతూ మండుటెండలను కూడ లెక్క చేయక ఉద్యామించమిం చారు. గుజరాత్‌లో విదేశీ వస్తు బహిష్కరణకు, మద్యపాన విక్రయశాలల వద్ద పికిటింగ్‌ కార్యక్రమాలకు ప్రేరణగా నిలచిన ఆమెను 157