పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌అహమ్మద్‌


ఆవరణలో జాతీయ కళాశాల ప్రారంభించారు. ఆ విద్యార్థుల భోజన వసతిని స్వయంగా చూశారు. ఈ సందర్భంగా తన పిల్లల చదువు సంధ్యాలను కూడ విస్మరించి జాతీయ భావాలకు ప్రతీకలైన విద్యార్థ్ధుల కోసం నిరంతరం శ్రమించారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టగా ప్రతి ఇంట గుప్పెడు బియ్యం సేకరించి కొంతకాలం జాతీయ విద్యాసంస్థను నెట్టుకొచ్చారు. కాలం గడిచే కొద్ది ఆర్థిక ఇక్కట్లు మిక్కుటం కావటం, మరోవైపు నుండి బ్రిటిషు ప్రభుత్వాధికారుల వేధింపులు మితిమీరటంతో ఆ సంస్థలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయాయి.

1928 నాి పండిత మోతీలాల్‌ నెహ్రూ సమర్పించిన నివేదికతో మౌలానా షఫీ దావూదీ విభేధించారు. అప్పటి నుండి ఆయన కాంగ్రెస్‌ పార్టీకి దూరమై అరహర్‌ పార్టీలో చేరారు. చివరకు 1937లో మౌలానా షఫీ దావూది రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆయన మూడు సంవత్సరాల పాటు రోగగ్రస్తులవ్వటంతో చికిత్స కోసం అధిక వ్యయమైంది.

ఆ కారణంగా జుబైదా కుటుంబం ఆర్థిక పరిస్థితి తీవ్ర వెనుకబాటును చవి చూసింది. ఆదాయం తెచ్చిపెట్టే న్యాయవాద వృత్తిని వదలుకోవటం, జాతీయోద్యమంలో ఇతరుల సహకారం లేకుండ కార్యక్రమాలను నిర్వహించటంతో పొదుపు చేసిన ధనం కరిగిపోవటం, అనారోగ్యం వలన అదనపు వ్యయం ముంచుకు రావటంతో ఆ కుటుంబం కునారిల్లిపోయింది. రోజువారి జరుగుబాటు కూడ కష్టంకాగా ఎందరికో ఆశ్రయం కల్పించిన షఫీ మంజిల్‌ భవంతిని అద్దెకిచ్చి, ఆ కుటుంబం మరో చిన్న గృహంలోకి నివాసం మార్చాల్సి వచ్చింది. కుటుంబ ఆర్థిక పరిస్థితు లు ఎంతగా దిగజారినా, సన్నిహితుల నుండి గాని, ప్రభుత్వం నుండి గాని సహాయం స్వీకరించడానికి జుబైదా నిరాకరించారు.

చివరికి ఆసంతా కరిగిపోవటంతో మిగిలిన కొద్దిపాటి భూమిని అమ్ముకుని జీవిత చరమాంకం గడపాల్సివచ్చింది. ఆ దుర్బర పరిస్థితిలోనూ శ్రీమతి జుబేదా బేగం మాతృదేశ సేవకు ఖరీదు కట్టాలేనంటూ, ప్రబుత్వం, ప్రముఖులు అందించవచ్చిన ఆర్థిక సహాయాన్ని నిరాకరించి కడగండ్ల జీవితాన్ని నిశ్శబ్దంగా గడిపారు.

154