పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు



కాంగ్రెస్‌ భవనానికి పంపి అక్కడ దాహనకాండను నిర్వహించారు. ఆ రోజుల్లో అతి ఖరీదైన దుస్తులు ధరించే న్యాయవాదిగా మౌలానా దావూది ప్రసిద్ధులు. ఆయన కూడ విలువైన బట్టలను విసర్జించారనడంతో ప్రజలు ఉత్తేజం పొంది విదేశీ వస్తువులు, వస్త్రాల బహిష్కరణలో చురుకుగా పాల్గొన్నారు. జుబెదా స్వయంగా ఇల్లిల్లు తిరిగి విదేశీ వస్త్రాలను సేకరించి, వాటిని షఫీమంజిల్‌కు చేర్చటం, ఆలా చేర్చిన బట్టలను ప్రజల సమక్షంలో అగ్నికి ఆహుతిచ్చే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి విదేశీ వస్త్రాల బహిష్కరణ కార్యక్రమాన్ని ఉదృతంగా నిర్వహించారు. ఖద్దరు ప్రచారంలో ప్రత్యేక శ్రద్దాచూపారు, స్వయంగా ఖద్దరు ధరించారు. ఖద్దరు ప్రచారంలో భాగంగా తన కుమార్తెల సహాయంతో ప్రత్యేక బగ్గీని ఏర్పాటు చేసుకుని పట్టణ వీధులలో, ఇతర గ్రామాలలో తిరుగుతూ స్వదేశీ వస్త్రధారణ ప్రచార కార్యక్రమాలను చేపట్టారు.

జుబైదా బేగం పర్దానషీ మహిళ అయినప్పికి భారత జాతీయ కాంగ్రెస్‌ నిర్వహించిన సభలు సమావేశాలన్నిటిలో భర్తతోపాటు పాల్గొన్నారు. ఇతర మహిళలు కూడ సమావేశాలలో పాల్గొనేట్టుగా ప్రోత్సహించారు. పలు ప్రాంతాలలో మహిళల సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సమర్థవంతంగా ఆమె నిర్వహించారు. ఈపర్య టనలలో ప్రదానంగా మహిళలను ప్రబావితం చేయ ప్రయ త్నించారు. జాతీయోద్యామం లో పాల్గొంటున్న కుటుంబాలతో పరిచయాలు పెంచుకుని, ఆ కుటుంబాల లో మగవారు అరెస్టులు కావటం, జైళ్ళకెళ్ళటం వలన మహిళలు, కుటుంబీకులు భయపడకుండ ధైర్యం చెప్పారు. స్వాతంత్య్రోద్యామకారుల కుటుంబాల సంక్షేమం కోసం, తాము ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కొంటూ కూడ బాధితులకు సహకరించారు.

ఈ సమావేశాలలో ఆవేశం, ఆలోచనలతో కూడిన ప్రసంగాలు చేస్తూ మహిళల్లో ధైర్యసాహసాలను నూరిపోస్తూ, వారిలో దేశభక్తి, త్యాగనిరతిని పెంపొందించారు. స్వయంగా ఉద్యమంలో పాల్గొనేట్టుగా మహిళలను పురికొల్పారు. షఫీమంజిల్‌ వేదికగా మహిళలకు సంబంధించిన పలు కార్యక్రమాలకు జుబెదా బేగం నాయకత్వం వహించారు. ఈ సందర్బంగా జైలుకి వెళ్ళాల్సి వచ్చినా, పోలీసు లాఠీల దెబ్బల తీవ్రతను చవిచూడల్సి వచ్చినా ధైర్యంగా ముందుకు సాగారు.

సహాయ నిరాకరణోద్యామంలో భాగంగా ప్రభుత్వ కళాశాలలను బహిష్కరించిన విద్యార్థుల పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధచూపారు. ఆ విద్యార్థుల కోసం తమ షఫీ మంజిల్‌

153