పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు



కావటంతో షపాతున్నీసా తీవ్రంగా కలతచెందారు. ఆమెకు లూధియానాలోని తన ఇంటిని, పుట్టీ పెరిగిన గడ్డను వదలి వెళ్ళటం సుతరాము ఇష్టంలేదు. ప్రాణాలు పోయినాలూథియానా వదలి వచ్చేది లేదని ఆమె భీష్మించుకున్నారు. ఆమె తండ్రి ఇంటిని కూడఎవ్వరో స్వాధీనం చేసుకున్నారు. ఆ భయానక వాతావరణం నుండి తప్పించుకోడానికి సంబంధీకులు తలోదారయ్యారు. చివరకు మౌలానా హబీబుర్రెహమాన్‌ నచ్చ చెప్పా క స్వంత ఇల్లు వదలిన ఆ దంపతులు శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నారు.

శరణార్థ్ధుల శిబిరంలో ఉండటం ఆమెకు ఏమాత్రం ఇష్టంలేదు. ఈ విషయాన్నిపలుమార్లు భర్త వద్ద వ్యక్తం చేస్తూ, ఈ దుస్థితిని చూడడనికేనా? మనం అష్టకష్టాలనుభరించింది? మనం మన ఇంటికి వెళ్లి పోదాం, పదండి అంటూ భర్తను పట్టుకుని ఆక్రోశించారు. ఆమెను ఓదార్చటం మౌలానాకు చాలా కష్టమైపోయింది. ఈ ఆవేదనతోఅమె ఒక్కోసారి స్థిమితం కోల్పోయి ప్రవర్తించసాగారు. ఆ పరిస్థితికి బాధాతప్త హృదయంతో మౌలా నా విచలితులవ్వడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.

చివరకు లూధియానా శరణార్థుల శిబిరంనుండి ఆ దంపతులు ఢిల్లీ చేరారు.విభజన తరువాత పరిణామాల వలన ఖాళీగా ఉన్న ఒక గృహంలో తల దాచుకున్నారు.ఆ తరువాత కొద్దికాలానికే, ఆ ఇంటి యజమాని తిరిగి రావడంతో తాము తలదాచుకున్నఇంటిని యజమానికి అప్పగించి వారు బజారుపాలయ్యారు. నిలువ నీడలేని దుస్థితిలోమళ్ళీ శరణార్ధి శిబిరం చేరక తప్పలేదు. ఆ సమయంలో పాకిస్థాన్‌ వెళ్ళమని కొందరిచ్చి న సలహాను షఫాతున్నీసా దంపతులు తీవ్రంగా అసహ్యించుకున్నారు. ఏది ఏమైనా ఇక్కడే ఉండి పుట్టి న మట్టిలో కలసి పోవాల్సిందే తప్ప పుట్టిపెరిగిన గడ్డను వదలి వెళ్ళేప్రసక్తి లేదని, ఆమె స్పష్టం చేశారు.

ఆమె లూథియానాలోని తన స్వంత ఇంటికి వెళ్ళాలని చివరి దశవరకు ఎంతగానో పరితపించారు. ఇంటికి ఎప్పుడు వెడదామంటూ భర్తను పలుమార్లు ప్రశ్నించి ప్రశ్నించిఎంతగా అలసి పోయినా ఎటువంటి ప్రయోజ నం లేకుండా పోయింది. చివరకు లూథియానాలోని స్వంత ఇంటి గడప మళ్ళీ తొక్కకుండానే శ్రీమతి షఫాతున్నీసా బీబీ 1948 జూన్‌ 1న ఢిల్లీలో కన్నుమూశారు.

149