పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు

గావించారు. అందుకు ఆగ్రహంచిన ప్రబుత్వం 1921 డిసెంబరులో ఆయనను కలకత్తాలో అరెస్టు చేసింది. విచారణ తరువాత 1922 ఫిబ్రవరిలో ఏడాది జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పుచెప్పింది.

ఈ సందర్బంగా ఎప్పుడూ బయటకు రాకుండ ఇంటిపట్టున కాలం గడుపుతున్న జులేఖా బేగంలోని అత్మవిశ్వాసం, దేశభక్తి, మాతృభూమి పట్ల తనకున్నబాధ్యత, జాతీయోద్యామం పట్ల ఉన్ననిబద్ధత బహిర్గతమయ్యాయి. మౌలానాకు శిక్ష పడటం పట్ల ఆమె ఆశ్చర్యపడలేదు. అందుకు ఆమె మానసికంగా సిద్ధాంగా ఉన్నారు. మౌలానాకు చాలా తక్కువ శిక్షపడినందుకు ఆమె అగౌరవంగా భావించారు. ఈ విషయాన్ని, ఈ రోజున నా భర్త కేసులో న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది. మేము అనుకున్న దానికంటే ఇది చాలా తక్కువ. నా భర్తకు అన్యాయం జరిగిందని మీరు అంగీకరిస్తారని అనుకుంటా అని గాంధీజీని ఉద్దేశించి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. (Understanding The Muslim Mind, Rajmohan Gandhi, Penguin Books, New Delhi, 1987, Page. 228-229)

మౌలానాను అరెస్టు చేయటంతో కలకత్తా కేంద్రంగా ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు జులేఖా బేగం ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని గాంధీజీకి రాసిన లేఖలో, నా భర్త అరెస్టు వలన బెంగాల్‌ ఖిలాఫత్‌ కమిటీ కార్యక్రమాల నిర్వహణలో ఏర్పడిన ఖాళీని నా కృషితో భర్తీ చేస్తాను. ఆయన ఇక్కడుంటే జరిగే పనులన్నీ యధాతదంగా జరుగుతాయని తెలుపుకుంటున్నాను. గతంలో నా భర్త నిర్బంధలో ఉన్నప్పుడు నా శక్తి మేరకు ఆయన బాధ్యతలను నేను నిర్వర్తించాను. గత ఐదు సంవత్సరాల నుండి నా ఆరోగ్యం బాగాలేదు. మానసికంగా బలహీనంగా ఉన్నాను. నా ఆనారోగ్యం దృష్ట్యా నా విధిని నేను నిర్వహించేందుకు మౌలానా అనుమతించేవారు కారు. అయినప్పటికి ఈ నశ్వరమైన శరీరాన్ని ఖిలాఫత్‌ ఉద్యమానికి సంపూర్ణంగా అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను, అని రాశారు.

మౌలానా రాజకీయ కార్యకలాపాలలో ఎంతో తోడ్పాటు అందించిన ఆమె ఆయన సాగించిన సాహితీ వ్యవసాయంలో ఆమె చేయూత ఎంతో ఉంది. ఓసారి నిద్రాలేమి వలన ఎర్రగా మారిన ఆమె కళ్ళను చూసి ఆమె మరదలు కళ్ళు అలా ఉన్నాయేంటని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ మధ్యాకాలంలో మౌలానా

131