పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాతీయోద్యమానికి సర్వం వొడ్డిన దానగుణశీలి

షంషున్నీసా అన్సారి

(-1938)

మాతృభూమిని బ్రిటిష్‌ దాస్యశృంఖలాలనుండి విముక్తం చేయడానికి సాగిన మహత్తర స్వాతంత్య్ర సంగ్రామంలో ఈ దేశపు స్త్రీ పురుషులు విభిన్న పాత్రలను నిర్వహించి లక్ష్యసాధనలో తోడ్పడ్డారు. ఈ మేరకు పోరుబాటన నడిచిన మహిళల్లో ఆత్మార్పణలతో కొందరైతే, అద్వితీయ త్యాగనిరతి, దాన,ధర్మ,దయాగుణాలతో మరికొందరు తమదైన క్రియాశీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఈ ద్వితీయ వర్గీకరణలోని మహిళలు తాము స్వయంగా ఉద్యమించకున్నా ఉద్యమకారులకు అన్నివిధాల తోడ్పాటు అందచేస్తూ ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటూ పరోక్షంగా ఉద్యమానికి జవసత్వాలను అందించారు. ఈ కోవకు చెందిన దానగుణశీలి శ్రీమతి షంషున్నీసా అన్సారి.

భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రధాన భూమిక నిర్వహించిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు ఢిల్లీకి చెందిన డాకర్‌ ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి ఆమె భర్త. 1899లో

డాక్టర్‌ అన్సారిని ఆమె వివాహమాడారు. ఆమె సాంప్రదాయక మత విద్యను అభ్యసిం చటంతోపాటు పర్షియన్‌, ఉరూ, అరబ్బీ బాషలలో ప్రావీణ్యం సంపాదించారు. సాహిత్య, రాజకీయ,సామాజిక గ్రంథాల పఠనం పట్ల ఆమెకు ఆసక్తి ఎక్కువ. సమకాలీన సమాజ

125