పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

రాజకీయాలకు దూరమయ్యారు.

ఈ మేరకు జీవితం చరమ దశ వరకు ఏదో ఒక మార్గాన బ్రిటిషు వ్యతిరేక పోరాటంలో ఆమె చూపిన తెగువ, ధైర్యసాహసాలను స్వయంగా గమనించిన మౌలానా ముహమ్మద్‌ అలీ ఆమె వ్యక్తిత్వంలోని ఔన్యత్యం మౌలానా మోహాని కంటే గొప్పదని కీర్తిస్తూ , ‘ his stature remain secondary to that of the fragile lady who was endowed with a heart larger than his...the woman, who had during his absence, inspired the Muslims with such daring and fortitude that even he could not have done had he not been behind the bars’. (Hasrath Mohani, Page.72) అని అనాflరు. ఆమెలోని ఉత్తమ గుణసంపదను మననం చేసుకుంటూ ఆనాటి ముస్లిం మహిళలలో మాత్రమే కాకుండ సమకాలీన పురుషులలో కూడ అంత స్థాయి కన్పించదని,మౌలానా హసరత్‌ మోహాని స్వయంగా నిశాతున్నీసా బేగం గురించిన రాసిన ఆర్టికల్‌లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.

‘ Her selflessness, modesty, sense of dignity and honour, benevolence, perception and sagacity, courage and truthfulness, her determination and daring, generosity and sincerity, the depth of her faith and the purity of devotion, her high sensibility and politeness and fortitude, and, above all her devotion to the Prophet and her faith placed Begum Mohani much above not just Muslim women but also above most men of time. ‘ (Hasrath Mohani, Page.72).

బేగం నిశాతున్నీసా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నా భర్తతోపాటుగా పలు ప్రాంతాలను చుట్టివచ్చారు. ఆ పర్యటనలలోని విశేషాలను, తన అనుభవాలను రాజకీయాభిప్రాయాలను అక్షరబధం చేస్తూ Safar Nama-e-Hijaz, Safar Nama-e-Iraq అను గ్రంథాలను రాసి ప్రచురించారు.

ఈ విధంగా ప్రత్యక్షంగా తన విలక్షణమైన వ్యవహారసరళితో, పరోక్షంగా తన భర్త అభిప్రాయాలను ప్రభావితం చేస్తూ, అటు భారత స్వాతంత్య్ర సంగ్రామంలో, ఇటు భారత కార్మికోద్యమ చరిత్రలో అత్యుత్తమ ధైర్యసాహసాలు, కార్యదక్షత, సమయస్పూర్తి ప్రదర్శించిన ఉద్యామకారిణిగా తనదైన ముద్రను సుస్థిరం చేసుకున్న బేగం నిశాతున్నీసా 1937 ఏప్రిల్‌ 18న కాన్పూర్‌లో కన్నుమూశారు.

120