పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు

సమావేశంలో మౌలానా మోహాని సంపూర్ణ స్వరాజ్యం కోరుతూ చారిత్రాత్మక ప్రతిపాదాన చేశారు. ఆ ప్రతిపాదనను బేగం నిశాతున్నీసా బలపర్చారు. గాంధీజీ వ్యతిరేకత వలన ఆనాడు ఆ ప్రతిపాదన తీర్మానం కాలేకపోయింది. ఆ సంఘటన నేపధ్యంలో 1922లో గయాలో జరిగిన మరొక సమావేశంలో ఆనాట్‌ఇఅంశాన్ని పురస్క రించుకుని మహాత్మాగాంధీ వైఖరిని నిశితంగా విమర్శిస్తూ ఆమె అద్భత ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం సభికులను ఆశ్చర్యచకితులను చేసింది. ఆ సమయంలో జైలులో ఉన్న మహాత్ముడు కూడ ఆమె అభిభాషణ వివరాలను తెలుసుకుని నిశాతున్నీసా నిబద్ధతను అభినందించారు.

ఈ సందర్భంగా సంపూర్ణ స్వరాజ్యం కాంక్షిస్తూ మౌలానా మోహాని చేసిన పలు ప్రసంగాల పట్ల ఆగ్రహంచిన ప్రబుత్వం 1922 ఏప్రిల్‌ 14న ఆయనను అరెస్టు చేసింది. బేగం నిశాతున్నీసా మళ్ళీ న్యాయపోరాటం ఆరంభించారు. మౌలానా కుటుంబం అలీఘ ర్‌ నుండి కాన్పూరుకు తరలి వెళ్ళినందున ఈ సారి ఆమె పోరు కాన్పూరు నుండి సాగింది. చివరకు మౌలానాకు కోర్టు రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఈ మేరకు జాతీయోద్యమకారునిగామౌలానా మోహాని అత్యధిక సమయం జైళ్ళలో గడపాల్సి రావటంతో నిశాతున్నీసా ఆర్థికంగా పలు కడగండ్లను ఎదుర్కొంటూ కూడ జాతీయ కాంగ్రెస్‌ నుండి ప్రజల నుండి వచ్చిన ఆర్థికసహాయాన్ని తిరస్కరించారు. ఈ విధంగా అన్ని కష్టనష్టాలను సహిస్తూ పోరుబాటన సాగిన నిశాతున్నీసా ఉద్యమకారుల కుటుంబాల కు ఆదర్శంగా నిలిచారు.

అహమ్మదాబాద్‌ జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలనంతరం 1924 డిసెంబరు 29న మౌలానా హసరత్‌ మోహాని భారత జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. భర్తను రాజకీయ సహచరునిగా భావించిన బేగం నిశాతున్నీసా ఆయన అభిప్రాయాలను సమర్ధించారు. ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొంటూ, సంపూర్ణ స్వరాజ్యం, ప్రజల సంక్షేమం కాంక్షించే ఆ దంపతులు తమ లక్ష్యం దిశగా ముందుకు సాగుతూ, భారత కార్మికోద్యమ నిర్మాణంలోనూ భాగస్వామ్యం వహించారు.

చివరివరకు అటు ప్రజలతో మమేకమై జాతీయోద్యమంలో, ఇటు కార్మికులతో ఏకమై కార్మికోద్యమంలో ఆమె చురుకన పాత్రను కొనసాగించారు. 1925లో కాన్పూరులో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల సందర్బంగా జరిగిన కార్మికుల భారీ ప్రదర్శ నకు ఆమె నాయకత్వం వహించారు. ఆ తరు వాత క్రమక్రమంగా నిశాతున్నీసా బేగం క్రియాశీలక

119