పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు


ఎటువంటి బలహీనత ప్రదర్శితం కారాదు. జాగ్రత్త సుమా! అని హెచ్చరించారు. ఈ లేఖను చూసి మౌలానా ఆశ్చర్యపోయారు.

మౌలానా పక్షాన వాదించేందుకు ఆ సమయంలో న్యాయవాదులు ముందుకు రాలేదు. అలీఘర్‌ కళాశాల కార్యదర్శి నవాబు వకారుల్‌ ముల్క్‌ (Nawab Wiqar-ulMulk) లాంటి ప్రముఖులు మౌలానాకు వ్యతిరేకంగా సాక్ష్యం పలికారు. (Hasrath Mohani, Muzaffar Hanafi, Trd. by Khadija Azeem, NBT, India, 1989, Page. 29) ఆ విపత్కర పరిస్థితులలో అధైర్యపడకుండ న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నంత కాలం ఆయా కార్యక్రమాలను ఆమె స్వయంగా పర్యవేక్షించారు.1908 ఆగస్టు 4న కోర్టు తీర్పు చెబుతూ మౌలానాకు రెండేళ్ళ జైలు, ఐదు వందల రూపాయల జరిమానా విధించింది. ఆ తీర్పు ఆమెను ఏమాత్రం కదిలించలేకపోయింది. దయనీయంగా ఉన్న కుటుంబం ఆర్థిక పరిస్థితుల కారణంగా జరిమానా కట్టలేదు. ఆ కారణంగా అత్యంత విలువైన పుస్తకాలు గల మౌలానా స్వంత గ్రంథాలయాన్ని కేవలం 60 రూపాయలకు పోలీసులు వేలం వేశారు. ఈ సందర్భంగా పోలీసులు నానా హంగామా సృష్టించారు. ఆ దుష్టచర్యలకు బేగం నిశాతున్నీసా కించిత్తు కూడ చలించలేదు.

చివరకు 1909 జూన్‌లో మలానా విడుదాలయ్యారు. జైలు నుండి విడుదల కాగానే మళ్ళీ ఆయన తన బ్రిటిషు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించారు. ఆయనకు నచ్చచెప్పి ప్రభుత్వవ్యతిరేక కార్యకలాపాల నుండి విరమింపచేయాల్సిందిగా బంధువులు, సన్నిహితులు ఆమెకు సలహాలనిచ్చారు. ఆ సలహాలు ఆమెకు రుచించలేదు. ఆపులు, సన్నిహిత బంధువులు దూరమయ్యే పరిస్థితులు వచ్చినా ధార్మిక,ఆర్థిక, రాజకీయ నిబద్ధ్దత నుండి ఏమాత్రం దారి మళ్ళేది లేదని బేగం నిశాతున్నీసా స్పష్టంచేశారు.

మౌలానా ఉర్దూ-ఏ-మౌల్లా ను పునరుద్దరించారు. ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారాన్నిప్రచురిస్తున్నందున ఉర్దూ-ఏ-మøల్లా ముద్రణకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ అవాంతరాన్ని అధిగమించేందుకు మౌలానా దంపతులు తమ చిన్నఅద్దె గృహంలో ఉర్దూ ప్రెస్‌ ఏర్పాటు చేసుకున్నారు.ఈ ప్రెస్‌లో బేగం నిశాతున్నీసా అహర్నిశలు పనిచేస్తూ, అన్నిబాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఉర్దూ-ఏ -మౌల్లా పత్రిక నిరాటంకంగా బయటకు రావటంలో ఆమె అన్ని విధాల మౌలానాకు తోడ్పటునిచ్చారు. బ్రిటిషు ప్రబుత్వచర్య లకు వ్యతిరేకంగా జాతీయ భావాలతో ప్రజలను

113