పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆ ఘోర విపత్తుకు బ్రిటిష్‌ ప్రభుత్వమే కారణం కానివ్వండి.. నా భర్తను సింహంలా మృత్యువును స్వీకరించనివ్వండి...జాతి ప్రయాజనాలు, ఆత్మ గౌరవాభిమానాల పరిరక్షణ విషయం లో వ్యకిగత జీవితాలు అంత ప్రాముఖ్యం కావు... మాతృదేశ విముక్తి పోరాటంలో ధనమాన ప్రాణాలను బలిపెట్టాల్సి ఉంటుంది...అందుకు ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు సరికదా, మనమంతా మరింతగా గర్వపడాలి.

..నా భర్త కోలుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆయన బ్రిటిష్‌ వాళ్ళతో పోరాడినట్లే, మృత్యువుతో కూడ పోరాడి విజయం సాధించగలరు. ఒకవేళ మృత్యువుదే పైచేయి అయినట్టయితే, గౌరవప్రదమైన జీవితం సాగించే ఉద్యమకారునికి లభించే మరణం, పదికాలాల పాటు నికృష్టంగా గడిపే భయంకర బానిస జీవితం కంటే ఎంతో ఉన్నతమైంది...అందువలన నన్నుఅర్థం చేసుకోండి. ప్రభుత్వాన్ని తన పని తాను చేసు కపోనివ్వండి. (భారతకి స్వాతంత్ర్య సంగ్రాం మే ముస్లిం మహిళావోంకా యోగ్ దాన్‌, డాక్టర్‌ ఆబెదా సమీయుద్దీన్‌, ఇస్టిట్యూట్ ఆఫ్‌ ఆబ్జెక్టివ్‌ స్టడుస్‌, న్యూఢిల్లీ, 1997, పేజి. 316-317)

ఈ ప్రకటన అటు ప్రభుత్వ వర్గాలలోనూ ఇటు ప్రజలలోనూ సంచలనం సృష్టించింది. ఆ ప్రకటనలోని ప్రతి వాక్యం దేశభక్తిపూరితమై యావత్తు దేశాన్ని ఉత్తేజపర్చింది. బేగం ఆలం ధైర్యానికి, ఆమెలో దాగిఉన్నఉద్యమ నిబద్దతకు, భర్త నిర్ణయాల పట్ల ఉన్నగౌరవానికి ఉద్యమకారులు జేజేలు పలికారు.

ఆ విధంగా జాతీయోద్యామకారులకు స్పూర్తిదాయక మార్గదార్శకం చేసిన బేగం ఆలం జీవితాంతం డాక్టర్‌ ముహమ్మద్‌ ఆలంతోపాటుగా విముక్తి పోరాటంలో పాల్గొని చరితారులయ్యారు.

మీరంతా మీ కుటుంబాల పాలకులు, శాసకులు సంపూర్ణాధికారులు కారా? అది నిజమైతే మనం మన కుటుంబాలలోని మగవాళ్లందర్నీ సహాయ నిరాకరణ ఉద్యమంలో నిష్టగా పొల్గోమనేట్టు ప్రోత్సహించాలి. ఉద్యమం పట్ల నిబద్ధతతో వ్యవహరించేలా చూడాలి. అందుకు విరుధంగా వ్యవహరిస్తే సాంఫిుకంగా బహిష్కరించాలి. మన మగవాళ్ళను కర్మనిష్టాపరులను చేయాలి.....ధర్మపోరాటం పట్ల దృఢచిత్తులై వ్యవహరించండి.

- అక్బరీ బేగం.

110