పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

కార్యకలాపాలకు పరోక్షంగా మద్దతునిస్తూ జాతీయోద్యమంలో భాగం పంచుకున్నారు. డాక్టర్‌ ఆలం తరచుగా జైలు కెడుతుండటంతో భర్త బాధ్యతలను తన పరిమితుల మేరకు ఆమె నిర్వహిస్తూ వచ్చారు. ఆమె కృషి, స్వాతంత్య్రోద్యమం పట్ల వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, ఆమెలోని ఉద్యమ నిబద్ధత, లక్ష్యసాధన పట్ల ఉన్న దృఢసంకల్పం 1932లో ప్రపంచానికి వెల్లడయ్యాయి.

1932లో డాక్టర్‌ ఆలంను బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ సమయానికి డాక్టర్‌ ఆలం తీవ్ర శారీరక రుగ్మతతో బాధాపడుతున్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం పట్ల, అధికారుల వ్యవహార సరళి పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న డాక్టర్‌ ఆలం అంటే మండిపడుతున్నఅధికారులు ఆయన పట్ల క్రూరంగా వ్యవహరించారు. అనారోగ్యంతో బాధాపడుతున్నప్పటికీ ఆయన చికిత్స పట్ల అధికారులు శ్రద్ధచూపలేదు. ఆ కారణంగా ఆయన ఆరోగ్యం రోజురోజుకు దిగజారి పోసాగింది. ఈ విషయ ం బయటకు పొక్కకుండా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకున్నా, స్వదేశీ పత్రికలు డాక్టర్‌ ఆలం అనారోగ్య పరిస్థితులను తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ విషయాలను తెలుసుకున్న ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు.బ్రిటిష్‌ ప్రభుత్వం మీద, జైలు అధికారుల మీద విమర్శలు గుప్పించారు. డాక్టర్‌ ఆలం మీద కక్షపూనిన అధికారగణం ఆ విమర్శలను ఏ మాత్రం ఖాతరు చేయలేదు. డాక్టర్‌ ఆలం గాని, ఆయన కుటుంబ సబ్యులు గాని స్వయంగా విజ్ఞప్తి చేస్తే తప్ప ఆయనకు వైద్యసౌకర్యం కల్పించేది లేదని అధికారులు మొండికేశారు. స్వయంగా కోరితే చికిత్స కు అనుమతిస్తామని సంసిద్ధతను వ్యక్తం చేశారు.

ఈ విషయమై ప్రజలలో తర్జన భర్జనలు ప్రారంభమైనాయి. ప్రభుత్వం స్వయంగా వైద్య సేవలను అందించాల్సి ఉండగా, అందుకోసం అభ్య ర్థించటం చిన్నతనంగా కొందరు భావించగా, మరికొందరు డాక్టర్‌ ఆలం అనారోగ్య తీవ్రత దృష్ట్యా వినతి పత్రం పంపటం మంచిదని అభిప్రాయపడ్డారు. డాక్టర్‌ ఆలం మాత్రం ఎటువంటి పరిస్థితులలోనూ తన వ్యక్తిత్వాన్ని చంపుకుని ప్రభుత్వానికి వినతిపత్రం పంపుకునేది లేదని స్పష్టంగా ప్రకటించారు. ప్రాణం పోయినా నేను ఆ పని చేయను అంటూ ఆయన మిన్నకుండి పోయారు. బేగం ఆలం భర్త ఆరోగ్యం పట్ల ఆవేదన చెందుతున్నప్పటికి భర్త అభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యర్థనలు పంపలేదు. ఈ పట్టుదల మూలంగా

108